IAS and IPS Officers Transfers: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత ఇప్పటికే పలు దఫాలుగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ వచ్చింది ప్రభుత్వం.. ఇక, పాలనపై పట్టు కోసం.. సమర్థవంతమైన పాలన కొనసాగించేందుకు.. సుదీర్ఘకాలం పాటు అధికారులు ఒకే దగ్గర ఉండే విధంగా సుదీర్ఘ కసరత్తు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ మధ్య పెద్ద స్థాయిలో సీనియర్ ఐఏఎస్ అధికారులు.. భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారులు.. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను బదిలీ చేశారు.. అయితే, మరోసారి ఏపీలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది సర్కార్.. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈవోగా ఏలూరు జేసీ ధాత్రి రెడ్డిని నియమించిన ప్రభుత్వం.. ఏపీ ఫైబర్‌నెట్ ఎండీగా కృష్ణా జిల్లా జేసీ గీతాంజలి శర్మ, మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ ఎండీగా పాడేరు సబ్ కలెక్టర్ సౌర్య మాన్ పటేల్‌ను నియమించింది.. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ ఐపీఎస్ రాహుల్ దేవ్ శర్మకు పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించింది ఏపీ సర్కార్.. ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డైరెక్టర్, ఏపీఎస్‌బీసీఎల్ ఎండీగా అదనపు బాధ్యతలతో పాటు డిస్టిలరీస్ అండ్ బ్రేవరీస్ కమిషనర్‌గా పూర్తి బాధ్యతలను అప్పగిస్తూ ఏపీ ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు విడుదల చేశారు..
Read Also: Spa Center: బయట నుంచి చూస్తే స్పా సెంటర్.. లోపల మాత్రం వ్యభిచారం..