మరోసారి ఏపీలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది సర్కార్.. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈవోగా ఏలూరు జేసీ ధాత్రి రెడ్డిని నియమించిన ప్రభుత్వం.. ఏపీ ఫైబర్‌నెట్ ఎండీగా కృష్ణా జిల్లా జేసీ గీతాంజలి శర్మ, మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ ఎండీగా పాడేరు సబ్ కలెక్టర్ సౌర్య మాన్ పటేల్‌ను నియమించింది.. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.