MP Mithun Reddy: సుప్రీంకోర్టులో ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట.. అప్పటి వరకు అరెస్ట్ చేయొద్దు..!
- ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట..
- ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు వెళ్లిన వైసీపీ ఎంపీ..
- ఏపీ పోలీసులకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Mithun Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట దక్కింది.. మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కేసులో ఏపీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు.. ఇక, ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ వరకు మిథున్‌రెడ్డిని అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు ఇచ్చింది.. ఇక, మధ్యంతర రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.. మిథున్ రెడ్డి తరఫున వాదనలు వినిపించారు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింగ్వి.. ఈ పిటిషన్‌పై జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్. మహదేవన్ ధర్మాసనం విచారణ జరిపింది.. కాగా, మద్యం అమ్మకాలపై సీఐడీ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టులో ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.. ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేశారు మిథున్ రెడ్డి..
Read Also: Andhra Pradesh: సంక్షేమ పథకాలు అమలు.. ఫీడ్ బ్యాక్‌లో షాకింగ్ విషయాలు..!
Also Read
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
- AP Mayor Reservations: ఏపీ మేయర్ రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
కాగా, మద్యం కొనుగోళ్ల వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ సీఐడీ నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ గత నెలలో హైకోర్టును ఆశ్రయించారు మిథున్‌రెడ్డి.. ఆ పిటిషన్‌పై విచారణ సమయంలో సీఐడీ తరుఫు న్యాయవాది మద్యం విధానంపై దర్యాప్తు తొలిదశలోనే ఉందని హైకోర్టుకు తెలియజేశారు.. ఎంపీ మిథున్‌రెడ్డిని నిందితుడిగా పేర్కొనలేదని చెప్పుకొచ్చారు.. దీంతో, ఎంపీ మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది.. మరోవైపు.. మరుసటి రోజునే ఏపీ సీఐడీ బృందాలు ఢిల్లీకి చేరుకున్నాయనే ప్రచారం జరిగిన తరుణంలో.. ఎంపీ మిథున్‌రెడ్డి సుప్రీంకోర్టులో ముందుస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం.. ఆ పిటిషన్‌పై ఈ రోజు విచారణ జరగడంతో పాటు.. తదుపరి విచారణ వరకు మిథున్‌రెడ్డిని అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు..
తాజావార్తలు
-
Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
-
AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
-
UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
-
Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!
-
CWC27 Ticket Ballot: టికెట్ బ్యాలెట్ ప్రక్రియకు అనూహ్య స్పందన.. 142 దేశాల నుంచి 1.50 కోట్ల దరఖాస్తులు..
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!