Donald Trump: అమెరికాలో అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై మూడోసారి దాడికి ప్రయత్నించారు. అక్టోబర్ 12న కాలిఫోర్నియాలో డొనాల్డ్ ట్రంప్ ర్యాలీ వెలుపల ఆయుధం కలిగి ఉన్న వ్యక్తిని అరెస్టు చేశారు. కోచెల్లా వ్యాలీలో ట్రంప్ ర్యాలీ వెలుపల చెక్ పాయింట్ వద్ద అనుమానితుడైన వేన్ మిల్లర్‌ను అరెస్టు చేసిన ఒక రోజు తర్వాత విషయం సంబంధించి వివరాలను అధికారులు వెల్లడించారు. రివర్ సైడ్ కౌంటీ షెరీఫ్ చాడ్ బియాంకో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. “మేము మరొక హత్య ప్రయత్నాన్ని నిరోధించామని భావిస్తున్నామని.. మిల్లర్ (49) అనే వ్యక్తి నకిలీ ప్రెస్ పాస్‌తో ర్యాలీలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుండగా పోలీసు చెక్‌పాయింట్‌లో పట్టుబడ్డాడు. కానీ., పోలీసులు చూసే సరికి అతని కారు రిజిస్టర్ కాలేదని తెలిసింది. వాహనాన్ని తనిఖీ చేసి తుపాకీతో పాటు నకిలీ పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్ ను స్వాధీనం చేసుకున్నారు. లోడ్ చేసిన తుపాకీ కూడా దొరికిందని అధికారులు తెలిపారు.
Iran Iraq War: ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా దాడి.. నలుగురు సైనికులు మృతి, 60 మందికి పైగా గాయాలు
అరెస్టు చేసిన వ్యక్తిపై ఆయుధాల ఆరోపణలపై కేసు నమోదు చేసి 5,000 డాలర్స్ కట్టించుకున్న తర్వాత బెయిల్‌ను మంజూరు చేసిన తర్వాత విడుదల చేశారు. రివర్‌సైడ్ ప్రెస్-ఎంటర్ ప్రైజ్ కి తన డిపార్ట్మెంట్ ట్రంప్ ప్రాణాలను కాపాడిందని షరీఫ్ రిప్లై ఇచ్చారు. అయితే, ఫెడరల్ ఏజెన్సీలు ఇందుకు ఏకీభవించలేదు.
Baba Siddique Murder: బాబా సిద్ధిఖీ హత్యకేసులో మూడో నిందితుడు అరెస్ట్.. మరో ముగ్గురు పరారీలో