RK Roja: తోతాపురి మామిడి రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. 40,795 మంది రైతుల ఖాతాల్లో రూ.185.02 కోట్ల నగదు జమ చేసింది.. దీనిపై స్పందించిన మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆర్కే రోజా.. ఇది రైతుల విజయం.. వైసీపీ విజయంగా అభివర్ణించారు.. మామిడి రైతులకు న్యాయం చేయాలని మాజీ సీఎం జగన్, వైఎస్సార్సీపీ పోరాటం చేసింది.. మామిడి రైతులకు మద్దతుగా జగన్ బంగారుపాళ్యం వచ్చినప్పుడు తప్పించుకొని ధోరణిలో ప్రభుత్వం…
వైఎస్ జగన్ మామిడి రైతాంగాన్ని పరామర్శించే చిత్తూరు జిల్లా పర్యటనకు అడ్డుకునేందుకు.. బంగారుపాళ్యం పర్యటనను వివాదం చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి అంబటి రాంబాబు.. మూడు వేల మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలకు నోటీసులు ఇచ్చారు. పెట్రోల్ బంకుల వద్ద పోలీసులను కాపలా పెట్టారు.
వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. చిత్తూరు జిల్లా పర్యటనపై హైటెన్షన్ నెలకొంది. బంగారుపాళ్యం మ్యాంగో మార్కెట్ యార్డు చిన్నది కావడంతో కేవలం 500 మందికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు పోలీసులు.. అంతేకాదు, ఎలాంటి ర్యాలీలు, రోడ్ షోలకు అనుమతి లేదని ఎస్పీ మణికంఠ తెలిపారు. మరోవైపు పోలీసుల తీరుపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ బెంగుళూరు నుంచి చిత్తూరు జిల్లా పర్యటనకు రాబోతున్నారు వైఎస్ జగన్?. మామిడి రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో వారిని పరామర్శించేందుకు బంగారుపాళ్యం…
మామిడి రైతులకు అండగా నిలిచింది కూటమి ప్రభుత్వం.. మామిడి రైతుల విషయంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అనవసర రాజకీయాలు చేస్తుందంటూ మండిపడుతున్నారు ప్రభుత్వ పెద్దలు.. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా కిలోకి 4 సబ్సిడీ ఇచ్చి రైతులకు అండగా నిలబడిందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. నష్టాన్ని ముందుగానే అంచనా వేసి మామిడి రైతులను ఆదుకోవాలని సబ్సిడీ ఇచ్చామంటున్నాయి ప్రభుత్వ వర్గాలు..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సెటైర్లు వేశారు. రైతులకు న్యాయం చేయకుండా.. పవన్ నిద్రపోతున్నారన్నారు. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నంత కాలం పవన్ నిద్రపోతానే ఉంటారు ఏమో? అని ఎద్దేవా చేశారు. అసత్య ప్రచారం చేయడంలో చంద్రబాబు దిట్ట అని పేర్కొన్నారు. వైఎస్ జగన్ అధికారంలో ఉండి ఉంటే రైతులకు ఈ పరిస్థితి వచ్చేది కాదున్నారు. 1995లో సీబీఎన్ బాగుండేదని.. ఇప్పటి సీబీఎన్ చాలా…
మామిడి రైతులు పల్ప్ పరిశ్రమ కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. కుప్పంలోని తన నివాసంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతులు, పల్ప్ పరిశ్రమల ప్రతినిధులు, ప్రాసెసింగ్ యూనిట్లతో సమావేశం నిర్వహించారు సీఎం. రైతుల నుంచి తక్షణం మామిడి కొనుగోలు చేసి వారిని ఆదుకోవాలని ప్రాసెసింగ్, పల్ప్ పరిశ్రమలను ఆదేశించారు.
పాకాల(మం) దామలచెరువులో మామిడి రైతులు, వ్యాపారులతో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 5లక్షల హెక్టార్లకు పైగా మామిడి సాగు అవుతుందన్నారు. ఇప్పటికి 22వేల టన్నులు మార్కెటింగ్ జరిగింది.. లక్ష టన్నులకు పైగా మార్కెటింగ్ జరగాల్సి ఉందన్నారు. తోతాపూరి కేజీకి రూ.12 రైతులకు చెల్లించాలి. చివరి మామిడి కాయ వరకు రు.4 సబ్సిడీ కల్పిస్తాం. పరిశ్రమలు రూ.8 తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. Also Read:Trivikram…