Nara Bhuvaneshwari: లండన్‌లో 2 ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్న నారా భువనేశ్వరి
- ఐవోడీ సంస్థ నుంచి రెండు ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్న నారా భువనేశ్వరి..
- లండన్ లోని మే ఫెయిర్ హాలులో అవార్డుల ప్రదానం కార్యక్రమం..
- ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ హోదాలో డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 అవార్డు..
- ప్రజాసేవ, సామాజిక ప్రభావం అంశాల్లో విశిష్టమైన సేవలు అందించినందుకు గాను..
- ప్రతిష్టాత్మక ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ నుంచి భువనేశ్వరికి అవార్డు..
- హెరిటేజ్ ఫుడ్స్ కు ఎక్స్ లెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో గోల్డెన్ పీకాక్ అవార్డు..
- ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nara Bhuvaneshwari: లండన్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి రెండు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. లండన్‌లోని మేఫెయిర్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (IoD) మరియు ఐవోడీ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో భువనేశ్వరికి ఈ గౌరవాలు లభించాయి.
Read Also: Plane Crashe: అమెరికాలో కూలిన కార్గో విమానం.. ముగ్గురు మృతి
Also Read
ప్రజా సేవా రంగం, సామాజిక ప్రభావం, నాయకత్వం అంశాల్లో విశిష్టమైన సేవలందించినందుకు గాను నారా భువనేశ్వరికి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 అవార్డును ఐవోడీ సంస్థ ప్రదానం చేసింది. అలాగే, కార్పొరేట్ పరిపాలనలో ఉన్నత ప్రమాణాలు పాటించినందుకు హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ కు గోల్డెన్ పీకాక్ అవార్డు ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ లభించింది. ఈ అవార్డును కూడా నారా భువనేశ్వరి స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ, భారతీయ సంస్థలు ప్రపంచ స్థాయిలో నిలుస్తున్న తీరు పట్ల గర్వం వ్యక్తం చేశారు. ఇక లండన్ పర్యటనలో భాగంగా చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు పలు కార్పొరేట్ సంస్థల ప్రతినిధులతో సమావేశమై, ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. అలాగే విశాఖపట్నంలో జరగబోయే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో పాల్గొనాలని ఆహ్వానించారు.
తాజావార్తలు
-
CM Vijay: సీఎం అయ్యాక పేరు మార్చుకున్న విజయ్?
-
Taslima Nasrin: 20 ఏళ్ల నిరీక్షణకు ముగింపు.. కోల్‌కతాకు తిరిగి వస్తున్న తస్లీమా
-
CM Chandrababu: ఏపీ పెట్టుబడుల గమ్యస్థానం.. అభివృద్ధిపై సీఎం కీలక వ్యాఖ్యలు
-
Shruti Haasan : సొంతంగా ఇల్లు కొని ఒంటరిగా గృహప్రవేశం చేసిన శృతి హాసన్.. అసలేం జరిగింది?
-
Samay Raina: నటుడు సమయ్ రైనాకు సుప్రీంకోర్టు షాక్.. రూ.10 లక్షల జరిమానా
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!