మంత్రి వాసంశెట్టి సుభాష్ అనుచరులు ఓ దళిత యువకుడిపై దాడి చేశారంటూ సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారంపై స్పందించారు మంత్రి సుభాష్.. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మొన్న అమలాపురం ఘటనలో ఉద్యోగాలు ఇప్పిస్తామని కొంతమంది డబ్బులు తీసుకున్నారు.. ఉద్యోగాలు రాకపోవడంతో డబ్బులు ఇచ్చిన వారు దాడి చేశారని తెలిపారు.. అయితే, దాడి చేసినవారు. నా అనుచరులు అని వైసీపీ బ్యాచ్.. నా పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
సీఎం కేసీఆర్ ప్రారంభించిన దళిత బంధు అనేది ఒక్క ఆర్ధిక సహాయం కాదు, దళితుల అభ్యున్నతి కోసం ప్రారంభించిన ఒక్కఉద్యమం అన్నారు మంత్రి హరీష్ రావు. వారి జీవితాలు వెలుగులు నింపాలనేది సీఎం కేసీఆర్ ఆశయం. దళితబంధు ద్వారా ఆర్ధిక సహాయం అందించడమతో పాటుగా వ్యాపారాభివృద్ధికి ప్రభుత్వ అధికారులు సహకరిస్తారు. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా 21 శాతం రిజర్వేషన్ దళితులకు కల్పించడం జరిగిందన్నారు. వైన్ షాప్ లో కూడా దళితులకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది.…