Minister Narayana: అమరావతి వర్సెస్ మావిగన్.. మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Narayana: అమరావతి రాజధాని నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. రాజధాని నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమావేశమైన ఆయన, పనుల పురోగతిని పరిశీలించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా అమరావతి అభివృద్ధి, మావిగన్ ప్రతిపాదన, నిర్మాణాల పురోగతిపై స్పందించారు. అయితే, మావిగన్ అనే ప్రతిపాదనను ప్రజలు సీరియస్‌గా తీసుకోవడం లేదని, దాన్ని వింటే అందరూ నవ్వుతున్నారని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. పరిపాలనపై అవగాహన లేకపోవడం వల్లే ఇలాంటి వ్యాఖ్యలు వస్తున్నాయని అన్నారు. మావిగన్ వర్సెస్ అమరావతి పేరుతో ఎన్నికలకు వెళ్తామని చెప్పడాన్ని వారి పార్టీల నాయకులే వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు.
అమరావతి రాజధానిలో ప్రాథమిక మౌలిక సదుపాయాల నిర్మాణం నిర్ణయించిన గడువులోపే పూర్తవుతుందని మంత్రి నారాయణ తెలిపారు. మొత్తం 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో 4,026 నిర్మాణాలు, ట్రంక్ రోడ్లు, లేఅవుట్ రోడ్లు, ఐకానిక్ భవనాలు, హైకోర్టు భవనాల నిర్మాణం కొనసాగుతోందని చెప్పారు. అయితే, ఈ నెల 15వ తేదీ నాటికి ఎమ్మెల్యే భవనాలు, 30వ తేదీ నాటికి ఎమ్మెల్సీలు, అధికారుల భవనాలు సిద్ధమవుతాయని మంత్రి వెల్లడించారు. గ్రూప్-1, గ్రూప్-2, ఎన్జీవో ఉద్యోగుల భవనాలను నెలరోజుల్లో సాధారణ పరిపాలన శాఖ (GAD)కు అప్పగిస్తామని తెలిపారు.
Also Read
- APPSC Group 1 మూల్యాంకనంపై హైకోర్టులో తుది విచారణ.. కీలక వాదనలు..
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
- Amaravati - Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
అమరావతిని దోమలు లేని ఆధునిక నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారాయణ అన్నారు. అందుకోసం యూజీడీ, విద్యుత్ లైన్లు, ఇతర కేబుళ్లన్నింటినీ భూగర్భంలో ఏర్పాటు చేస్తూ రహదారుల నిర్మాణం చేపట్టామని, అందువల్లే పనులు కొంత సమయం తీసుకున్నాయని వివరించారు. కేంద్ర ప్రభుత్వ టవర్స్ నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.3,945 చెల్లిస్తున్నారని, అదే సమయంలో హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టుకు చదరపు అడుగుకు రూ.3,374 మాత్రమే ఖర్చవుతోందని మంత్రి వివరించారు. దీనిపై అనవసర ప్రచారం జరుగుతోందని అన్నారు మంత్రి నారాయణ…
తాజావార్తలు
-
IND vs SL Semi-Final: భారత్ vs శ్రీలంక సెమీఫైనల్.. బుడ్డోడికి షాక్.. ప్లేయింగ్ 11, పిచ్, వెదర్, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
CM Vijay: ‘రాజరికం, కుటుంబ పాలనకు TVKలో చోటు లేదు’.. ధారాపురం సభలో విజయ్ కీలక వ్యాఖ్యలు
-
LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
-
Shubman Gill: 405 స్కోర్ చూసి కంగారుపడిపోయా.. ఓటమి తప్పదనుకున్నా.. కానీ.: గిల్
ట్రెండింగ్
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!