Minister Nara Lokesh: ఏయూలో విద్యార్థి మృతిపై స్పందించిన మంత్రి న లోకేష్.
- ఏయూలో విద్యార్థి మృతిపై స్పందించిన మంత్రి నారా లోకేష్..
- వర్సిటీలో రాజకీయాలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయి..
- ఉద్దేశపూర్వకంగా క్లాస్ లు జరగకుండా అడ్డుకోవడం సరికాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nara Lokesh: ఆంధ్రా యూనివర్సిటీలో విద్యార్థి మృతి చెందడంతో.. ఉద్రిక్తత నెలకొంది.. నిన్నటి నుంచి విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు.. వీసీ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.. అయితే, ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థి మృతిపై స్పందించారు మంత్రి నారా లోకేష్.. వర్సిటీలో రాజకీయాలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు.. నిన్న ఆంధ్రా యూనివర్సిటీలో ఒక విద్యార్ధి ఫిట్స్ వచ్చి చనిపోయారని తెలిపారు.. అయితే, అంబులెన్స్ లో తీసుకెళ్లినా కాపాడలేకపోయాం అన్నారు.. కానీ, కొందరు ఉద్దేశపూర్వకంగా క్లాస్ లు జరగకుండా అడ్డుకోవడం సరికాదని హితవు చెప్పారు.. విద్యాలయాల్లో రాజకీయ జోక్యం ఉండకూడదన్నారు. ఆంధ్రా యూనివర్సిటీని టాప్ 100 లో ఉంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం అన్నారు లోకేష్. ప్రభుత్వం ఎలాంటి చర్చలకైనా సిద్ధంగా ఉందని.. అంతేకానీ వైస్ ఛాన్సలర్ లను ఇబ్బంది పెట్టడం, ఆటంకాలు సృష్టించడం సరికాదన్నారు. అలా కాకుండా రాజకీయం చేస్తామంటే కఠిన చర్యలకు వెనకడబోమాని హెచ్చరించారు.. కొన్ని విశ్వవిద్యాలయాల్లో జరిగిన అవకతవకలపై కమిటీ వేస్తాం. 100 రోజుల్లోపు రిపోర్ట్ తెప్పించి యాక్షన్ తీసుకుంటామని ప్రకటంచారు మంత్రి నారా లోకేష్..
Read Also: Students Protest: ఆంధ్రా యూనివర్సిటీలో టెన్షన్.. టెన్షన్..
Also Read
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
- AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
కాగా, BED సెకండ్ ఇయర్ విద్యార్థి మణికంఠ మృతి పట్ల విద్యార్థుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు.. నిన్న రాత్రి వీసీ ఛాంబర్ లోకి చొచ్చుకొని పోయి రచ్చ రచ్చ చేశారు.. ఈ రోజు యూనివర్సిటీ బంద్‌కు విద్యార్థి సంఘ నాయకులు పిలుపునిచ్చారు. అందులో ఈ రోజు పరీక్షలు, క్లాస్‌లో బహిష్కరించింది ఆందోళనకు దిగారు.. అయితే, విజయనగరానికి చెందిన వింజమూరి వెంకట సాయి మణికంఠ అనే 25 ఏళ్ల విద్యార్థి.. యూనివర్సిటీలో బీఈడీ రెండో సంవత్సరం చదువుతూ క్యాంప్‌లోని శాతవాహన హాస్టల్‌లో ఉంటున్నాడు. గురువారం ఉదయం వాష్‌రూమ్‌లో జారిపడ్డాడు.. విద్యార్థులు వెంటనే వర్సిటీ ఆవరణలో ఉన్న డిస్పెన్సరీకి ఫోన్ చేసి అంబులెన్స్‌ను రప్పించినా ప్రాణాలు కాపాడలేకపోయారు.. తనకు ఊపిరి అందడం లేదని, ఆక్సిజన్ పెట్టాలని మణికంఠ కోరాడు.. అంబులెన్స్‌లో ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడంతో ఆ తర్వాత కేజీహెచ్‌కు తీసుకువెళ్లారు. కానీ, అప్పటికే అతను మరణించినట్టు వైద్యులు తెలిపారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు అప్పటి నుంచి ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు..
తాజావార్తలు
-
BAN vs AUS: ఆసీస్‌కు ఊహించని షాక్.. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఘన విజయం..
-
Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్‌కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
-
APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!