మంత్రి కొలుసు పార్థసారథి వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ వ్యవహార శైలి మార్చుకోవడం లేదని పార్టీలో అందరూ మారుతున్నారని తెలిపారు. సంక్రాంతి కేవలం కూటమి నాయకులకే అని వైసీపీ నేతలంటున్నారు.. సంక్రాంతి ఎవరికో అవగాహన లేకుండా, క్షేత్రస్థాయిలో అంశాలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. రైతులు అందరూ ఈ ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నారు.. గతంలో ఎగ్గొట్టిన సబ్సిడీలు అన్నీ పునరుద్ధరించాం.. కూటమి ప్రభుత్వం అన్ని పథకాలు అమలు చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ద్వారా భయానికి గురైన ప్రజల భయాన్ని పోగొట్టాం.. అన్న క్యాంటీన్లు ప్రారంభించి 5 రూపాయలకే ఆకలి తీరుస్తున్నాం.. NREGS ద్వారా పవన్ కళ్యాణ్ నేతృత్వంలో సిమెంట్ రోడ్లు గ్రామాలకు వచ్చాయని వెల్లడించారు.
Read Also: India-Bangladesh: బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషనర్‌కు భారత్ సమన్లు..
వైసీపీ పాలనలో రూ.6679 కోట్ల విదేశీ పెట్టుబడులు వస్తే… కూటమి ప్రభుత్వం 6 నెలల్లోనే రూ.85 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చామని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. ఏపీలో పెట్టుబడి పెట్టడానికి పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి.. రూ. 65 వేల కోట్లతో సీబీజీ ప్లాంట్లు పెట్టడానికి MoUతో పాటు అనుమతులు కూడా వచ్చాయని అన్నారు. మరోవైపు.. మాజీ మంత్రి రోజా అన్నీ గాలి మాటలు మాట్లాడుతుందని మంత్రి విమర్శించారు. 2018-19లో అదానీ డేటా సెంటర్ కు కేటాయిస్తే… ఆ సెంటర్ రావడానికి వైసీపీ ప్రయత్నించలేదని తెలిపారు. వైసీపీ ఎందుకు ఖాళీ అవుతోందో తెలుసుకోవాలని మంత్రి సూచించారు.
Read Also: Team India: 8 ఏళ్ల తర్వాత జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వనున్న టీమిండియా స్టార్ ప్లేయర్..!
జగన్ విధానం బెదిరించడం, కక్ష కట్టడం అని మంత్రి పార్థసారథి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల అంశంలో జగన్‌వి పగటి కలలా, రాత్రి కలలా అని దుయ్యబట్టారు. గత ప్రభుత్వంలో ధాన్యం సేకరణ చేసి డబ్బులు ఎగ్గొట్టారని తెలిపారు. గృహ నిర్మాణాల విషయంలో కేంద్ర సహాయం అందుతోందని గుర్తుంచుకున్నాం.. అందుకే PMAY NTR NAGAR అని పెట్టామన్నారు. మరోవైపు.. నూజివీడు గ్రావెల్ తవ్వకాలపై పూర్తి వివరాలు త్వరలో చెబుతానని పేర్కొ్న్నారు. నూజివీడులో గ్రావెల్ తవ్వకాలపై యార్లగడ్డ వెంకట్రావు సమాచార లోపంతో మాట్లాడి ఉంటారని మంత్రి పార్థసారథి అన్నారు.