AP Ministers: వరద తగ్గేవరకు పునరావాస కేంద్రాలు.. ప్రతీ కుటుంబానికి రూ.3 వేలు..
- వరద తగ్గేవరకు అన్ని వసతులతో పునరావాస కేంద్రాలు కొనసాగుతాయి..
- వరదలు తగ్గి సొంత గ్రామాలకు వెళ్లే సమయంలో ప్రతి కుటుంబానికి 3 వేల రూపాయలు ఇస్తామన్న మంత్రులు..
- వదర ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు అచ్చెన్నాయుడు.. నిమ్మల రామానాయుడు పర్యటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Ministers: వరద తగ్గేవరకు అన్ని వసతులతో పునరావాస కేంద్రాలు కొనసాగుతాయి.. వరదలు తగ్గి సొంత గ్రామాలకు వెళ్లే సమయంలో ప్రతి కుటుంబానికి 3 వేల రూపాయలు అందిస్తాం అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు.. ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం దాచారం గ్రామంలో నిర్వసితులతో ముఖా ముఖి నిర్వహించారు మంత్రులు.. నిర్వాసితులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం హయంలో వరదల సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గాల్లోనే పరామర్శలు, సమీక్షలు నిర్వహించేవాళ్లు.. ప్రతిపక్షాలు వరద బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేసినా పట్టించుకోలేదని విమర్శించారు.. అయితే, వరద బాధితులను ఆదుకునేందుకు NDA ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు.
Read Also: Jagadish Reddy: విహార యాత్రలు కాంగ్రెస్ నేతలకు అలవాటు.. జీవన్ రెడ్డికి జగదీష్ రెడ్డి కౌంటర్
Also Read
- Pawan Kalyan: మావిగన్ పేరు వినడానికే చిరాకుగా ఉంది.. పవన్ ఫైర్
- Pawan Kalyan: తెలంగాణ వాళ్లకు మా తెలంగాణ అనే భావన ఉంది.. ఆంధ్రా వాళ్లకు ఎటువంటి భావన ఉందో అర్థంకాదు..!
- Pawan Kalyan: అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులు.. మరోసారి తెలంగాణ వివాదంపై స్పందించిన పవన్ కల్యాణ్..
- AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి అభివృద్ధి, కీలక విధాన నిర్ణయాలపై ఫోకస్..
ఇక, వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారని తెలిపారు మంత్రి అచ్చెన్నాయుడు.. నలుగురు మంత్రులు ముంపు ప్రాంతాలలో క్షేత్ర స్థాయిలో పర్యటించాలని సీఎం ఆదేశించారన్న ఆయన.. ముంపు గ్రామాల ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించాలని స్పష్టంగా చెప్పారన్నారు.. వరద బాధితులను ఆదుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఒక అడుగు ముందే ఉంటుందన్నారు.. వరద తగ్గేవరకు అన్ని వసతులతో పునరావాస కేంద్రాలు కొనసాగుతాయి.. వరదలు తగ్గి సొంత గ్రామాలకు వెళ్లే సమయంలో ప్రతి కుటుంబానికి రూ.3 వేలు అందిస్తాం అని ప్రకటించారు. వరద బాధితులకు ఎదురవుతున్న అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు మంత్రి అచ్చెన్నాయుడు.
తాజావార్తలు
-
Pawan Kalyan: కేబినెట్ సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన డిప్యూటీ సీఎం పవన్!
-
Upcoming K-Dramas : సస్పెన్స్ నుంచి రొమాంటిక్ దాకా… జూన్ లో చూడవలసిన 6 కొత్త కె-డ్రామాలు
-
OnePlus Turbo 6X: వన్ప్లస్ టర్బో 6x రిలీజ్ డేట్ ఫిక్స్.. 8000mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్
-
Electricity Bill: ఇంట్లో ఈ పరికరాలే మీ కరెంట్ బిల్లును పెంచుతున్నాయా? అసలు నిజం ఇదే
-
Chiranjeevi: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిరంజీవి ట్వీట్..’తండ్రిగా మాత్రమే కాదు.. నటుడిగా కూడా గర్వపడుతున్నా’
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!