ఏపీలో భూమి రిజిస్ట్రేషన్ విలువ పెంపుపై గత కొంతకాలంగా ప్రచారం సాగుతూ వచ్చింది.. జనవరి 1వ తేదీ నుంచి ధరలు పెరుగుతాయని సంకేతాలు వచ్చాయి.. అయితే, భూముల విలువ పెంపుకు కసరత్తు చేస్తోంది ఏపీ ప్రభుత్వం... ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఇవి అమల్లోకి రాబోతున్నట్టు క్లారిటీ ఇచ్చింది.. గ్రోత్ సెంటర్ల ఆధారంగానే పెంపుదల చేయాలన్నది నియమంగా పెట్టుకుంది.. సగటున 15 నుండి 20 శాతం వరకు పెంపుదల ఉండే అవకాశం ఉంది..
ఆంధ్రప్రదేశ్‌లో 2025 జనవరి 1వ తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి రాబోతున్నాయి.. ఈ మేరకు కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుందనే ప్రచారం సాగుతోంది.. పట్టణాలు, గ్రామాల్లో ఒకేసారి కొత్త భూమి విలువలు అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని.. ప్రసుత్తం ఉన్న దానిపై 10 శాతం నుంచి 15 శాతం వరకు భూమి విలువలు పెరిగే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చాయి.. అయితే, దీనిపై క్లారిటీ ఇచ్చారు మంత్రి అనగాని సత్యప్రసాద్.. జనవరి ఫస్ట్…