Madanapalle Incident: మదనపల్లి ఘటనపై హోం మంత్రి అనిత సీరియస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madanapalle Incident: మదనపల్లిలో జరిగిన దారుణ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన చాలా బాధాకరమని పేర్కొంటూ, బాధితురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు వెల్లడించారు. ఘటనకు సంబంధించి ముందుగా ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాలో తనను ట్యాగ్ చేశారని అనిత తెలిపారు. అనంతరం సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నట్లు చెప్పారు. ప్రాథమిక విచారణలో ముద్దాయి డ్రగ్స్ లేదా గంజాయి సేవించలేదని, అయితే మితిమీరిన మద్యం సేవించినట్లు గుర్తించామని వెల్లడించారు. మొదట బాలిక అదృశ్యమై ఉండవచ్చని అనుకున్నామని, కానీ స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు విచారణ చేపట్టి బాలిక మృతదేహాన్ని ఆమె ఇంటి ఎదురుగా గుర్తించారని తెలిపారు.
నిందితుడిని తమకు అప్పగించాలని స్థానికులు ఆందోళనకు దిగారని హోంమంత్రి చెప్పారు. అయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉండటంతో, విచారణకు ఆటంకం కలగకుండా బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టంకి, నిందితుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అతడు బెయిల్‌పై బయటకు రాకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఇటువంటి ఘటనలపై తమ ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరిస్తోందని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.
Also Read
- CM Chandrababu: రాష్ట్రంలో నీటి కొరతపై అలర్ట్.. ఎల్‌నినోపై ప్రజలకు సీఎం కీలక సూచనలు
- AP COVID-19 Cases: కరోనా వ్యాప్తిపై ఏపీ వైద్య ఆరోగ్యశాఖ కీలక ప్రకటన.. కేరళ టాప్.. ఏపీకి 8వ స్థానం..!
- AP Assembly Panel Speakers: ఏపీ అసెంబ్లీకి కొత్త ప్యానల్ స్పీకర్లు.. ఆరుగురి పేర్లు ప్రకటించిన స్పీకర్
- CM Chandrababu: దమ్ముంటే అసెంబ్లీకి రండి.. వైసీపీకి సీఎం చంద్రబాబు సవాల్.. మెగా డీఎస్సీపై కీలక వ్యాఖ్యలు
కాగా, మదనపల్లిలో చిన్నారి హత్య కేసు ఉద్రిక్తతకు దారి తీసింది. చిన్నారి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తీసుకెళ్లేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలను స్థానికులు అడ్డుకుంటూ ఆందోళనకు దిగారు. నిందితుడిని తమకు అప్పగించాలని, లేకపోతే ఎన్కౌంటర్ చేయాలంటూ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఎస్పీ సహా ఇతర పోలీసు అధికారులు స్థానికులతో చర్చలు జరిపారు.. ఆందోళన కారణంగా చెన్నై–ముంబై జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదని కచ్చితంగా కేసులో నిందితుడికి శిక్ష పడేలా చేస్తామంటూ కడప ఎస్పీ విశ్వనాధ్ స్థానికులకు వివరించే ప్రయత్నం చేస్తున్న స్థానికులు ఆందోళన విరమించక పోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
తాజావార్తలు
-
Virat Kohli: 18 ఏళ్ల క్రికెట్ ప్రయాణం.. విరాట్ కోహ్లీని ‘కింగ్’గా మార్చిన రికార్డ్ ఇదిగో.!
-
Anirudh – Kavya Maran Wedding : కావ్య మారన్ – అనిరుధ్ పెళ్ళికి వేదిక రెడీ?
-
Bus Stops Changed: కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ఎఫెక్ట్.. ఆ ప్రదేశంలో బస్ స్టాప్స్ మార్పు..
-
This Week Theatrical Releases: పృథ్వీరాజ్ ‘ఖలీఫా పార్ట్ 1’ నుండి రవి తేజ ‘ఇరుముడి’ వరకు.. ఈ వారం థియేటర్లలో చూడాల్సిన సౌత్ సినిమాలు..
-
Beetroot Halwa: బీట్రూట్ తినడం ఇష్టం లేదా.. అయితే “బీట్రూట్ హల్వా” ఇలా చేసేయండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు.!
ట్రెండింగ్
-
Sanjay Manjrekar: లైవ్‌లో మాజీ క్రికెటర్ల మధ్య వార్.. అద్దంలో చూసుకో అంటూ ఒకరిపై మరొకరు సెటైర్లు!
-
Jeep Compass 85th Anniversary Edition లాంచ్.. ధర రూ.26.70 లక్షలు, కేవలం 85 యూనిట్లే!
-
Flower Plants: వర్షాలు పడుతున్నాయా.? అయితే ఆలస్యం ఎందుకు.. ఎక్కువ కష్టపడకుండానే ఇంట్లోనే పూల తోట పెంచేయండి ఇలా..!
-
రూ.8,499కే ఇంట్లోనే థియేటర్.! 200 అంగుళాల స్క్రీన్, స్మార్ట్ ఫీచర్లతో XElectron Techno Plus ప్రొజెక్టర్ లాంచ్.!
-
Jio Prime Membership: గుడ్‌న్యూస్.. Jio Prime రీలాంచ్.. ఏడాది పాటు రీఛార్జ్ ధర టెన్షన్ ఉండదు..!