AP Crime: ఆంధ్రప్రదేశ్‌లో మరో విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రామచంద్రపురంలో 5వ తరగతి విద్యార్థిని మృతి చెందింది.. స్థానిక భాష్యం పబ్లిక్ స్కూల్‌లో చదువుతున్న ఐదో తరగతి విద్యార్థిని రంజిత (10) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందింది. ఈ ఘటన రామచంద్రపురంలో తీవ్ర విషాదాన్ని నింపింది.. రంజిత తన గదిలో ఉరివేసుకున్నట్టు తల్లిదండ్రులకు సమాచారం అందినప్పటికీ, తల్లి సునీత మాత్రం ఇది ఆత్మహత్య కాదని, ఎవరో చంపి ఫ్యాన్‌కి వేలాడదీశారని…
Kurnool Bus Accident: కర్నూలు బస్ దగ్ధం ఘటన లో రెండవ కేసు నమోదు అయింది. ఉలిందకొండ పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదైంది. తుగ్గలి మండలం రాంపల్లికి చెందిన ఎర్రిస్వామి ఫిర్యాదు చేయగా.. శివ శంకర్ పై కేసు నమోదు చేశారు.
Cyber Fraud: AI టెక్నాలజీతో సీఎం చంద్రబాబు, దేవినేని ఉమా పేర్లు చెప్పి డబ్బులు వసూల్ చేసిన సైబర్ నిందితుడు భార్గవ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నెల క్రితం కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇప్పిస్తానని ఓ టీడీపీ నేత నుంచి 50 వేల రూపాయలను భార్గవ్ వసూలు చేశాడు.
Vijayawada Horror: విజయవాడ ఉర్మిళ నగర్‌లో ఘోర దారుణ సంఘటన చోటు చేసుకుంది. వృద్ధురాలి సొంత అక్క కుమారుడు ముక్కలు ముక్కలుగా నరికినట్లు సమాచారం. తల, కాళ్లు, చేతులు, మొండెం భాగాలను గోనె సంచిలో కట్టి వేర్వేరు ప్రాంతాల్లోని మురుగు కాల్వల్లో పడేశాడు.
Anakapally : అనకాపల్లి జిల్లాలో మళ్లీ వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. 4 రోజుల వ్యవధిలో 2 మృతదేహాలు సంచలనంగా మారాయి. చనిపోయింది ఎవరు? చంపింది ఎవరు? నగర శివారు ప్రాంతాలే ఎందుకు ఎంచుకున్నారు? కలకలం రేపిన ఆడ, మగ ఈ రెండు మృతదేహాలకు ఏమైనా సంబంధం ఉందా? రెండు మృత దేహాలు.. వంద అనుమానాలు.. మిస్టరీ మరణాలు వెనక ఎవరి హస్తం ఉంది. అనకాపల్లి జిల్లాలోని సబ్బవరం పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా మృతదేహాలు కలకలం…
Fake ED Officers: గుంటూరు జిల్లాలో ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) పోలీసులమంటూ నటించిన దుండగులు భారీ దోపిడీ చేశారు. సుమారు రూ. 70 లక్షల నగదుతో పాటు ఒక వ్యక్తిని కూడా తీసుకెళ్లిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
Vizag Drug Case: విశాఖ పట్నంలో సంచలనం రేపిన డ్రగ్స్ కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. అయితే, అరెస్ట్ చేసిన వారిలో సౌతాఫ్రికాకు చెందిన థామస్ను వారం రోజుల పాటు, అక్షయ్ కుమార్ అలియాస్ మున్నా, డాక్టర్ కృష్ణ చైతన్యను మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీలోకి తీసుకున్నట్టు చెప్పారు.