DMK: వెన్నుపోటుదారుడు, అతను బీజేపీకే లాభం.. రాహుల్ గాంధీపై డీఎంకే దాడి..
- రాహుల్ గాంధీపై డీఎంకే అధికార పత్రిక మురసోలి తీవ్ర విమర్శలు.
- తమిళనాడు ఎన్నికల్లో కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని ఆరోపణ.
- కేరళ ప్రచారంలో పినరయిపై చేసిన వ్యాఖ్యలపై డీఎంకే ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DMK: ప్రతిపక్ష ఇండియా కూటమిలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. ముఖ్యంగా కాంగ్రెస్, ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీపై మిత్రపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల సీపీఎం నేత, మాజీ సీఎం పినరయి విజయన్ రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ.. ఆయన వల్ల బీజేపీకి లాభం చేకూరుతోందని విమర్శించారు. తాజాగా, డీఎంకే కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే కూటమిలో పోటీ చేసిన కాంగ్రెస్, ఎన్నికల అనంతరం విజయ్‌తో చేతులు కలిపింది. ఈ పరిణామాలపై డీఎంకే పార్టీ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షత వహించిన ఇండియా కూటమి సమావేశానికి కూడా డీఎంకే వెళ్లలేదు.
ఇడిలా ఉంటే, డీఎంకే అధికారిక పత్రిక మురసోలిలో రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేసింది. కాంగ్రెస్ పార్టీ డీఎంకేను వెన్నుపోటు పొడించిందని ఆరోపించింది. రాహుల్ గాంధీ వల్లే ఇలాంటి రాజకీయ పరిణామాలు జరిగాయని చెప్పింది. కేరళ మాజీ సీఎం పినరయి విజయన్‌పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్ని డీఎంకే తప్పుపట్టింది. పినరయి విజయన్, ప్రధాని మోడీ మధ్య రహస్య ఒప్పందం ఉందని రాహుల్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యల్ని వామపక్షాలు ఖండించాయి.
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
ఇండియా కూటమిలో అఖిలేష్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) కూడా కాంగ్రెస్ వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేసిందని మురసోలి పేర్కొంది. డీఎంకే, ఆప్ వంటి కీలక మిత్రపక్షాలు దూరం కావడం ఇండియా కూటమిలో ప్రతిపక్షాల ఐక్యతకు పెద్ద దెబ్బగా అభివర్ణించింది. బీహార్‌లో అనేక అంశాలపై కాంగ్రెస్ మరియు బీజేపీ నాయకుల మధ్య రహస్య అవగాహనలు ఉన్నాయేమోనని ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ అనుమానాలు వ్యక్తం చేశారని, ఈ విషయాన్ని ప్రస్తావిస్తే కాంగ్రెస్ నుంచి సరైన మద్దతు రాలేదని మురసోలి ఆరోపించింది.
ఇండియా కూటమి సమావేశంలో బీజేపీ వ్యతిరేక కన్నా కాంగ్రెస్ వ్యవహారశైలి పైనే అసంతృప్తి ఎక్కువగా ఉందనే వార్తలు వినిపించాయి. రాహుల్ గాంధీ అపరిపక్వత, మిత్రపక్షాలతో వ్యవహరించే తీరు కారణమని డీఎంకే అధికారిక పత్రిక ఆరోపించింది. కూటమిలో విభేదాలకు బాధ్యత రాహుల్ గాంధీ తీసుకోవాలని డిమాండ్ చేసింది. రాహుల్ తీరు వల్ల బీజేపీకే లాభం చేకూరుతోందని మురసోలి అభిప్రాయపడింది.
తాజావార్తలు
-
LPG Cylinder Price Hike: పండుగ సీజన్‌కు ముందు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!