Actor Vishal : బొకేలు, శాలువాలు పక్కనబెట్టి కాలేజీ స్నేహితుల కలయిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంచలనం సృష్టిస్తూ జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఆయన సీఎం అయినప్పటి నుంచి కోలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు ఒక్కొక్కరిగా కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ యాక్షన్ హీరో విశాల్ తన పాత స్నేహితుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీకి సంబంధించిన వివరాలను పంచుకుంటూ విశాల్ సోషల్ మీడియాలో పెట్టిన ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం నెట్లో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఈ భేటీ అనంతరం విశాల్ స్పందిస్తూ.. “లయోలా కాలేజీలో మన పరిచయం ఏర్పడిన నాటి నుంచి నేను మిమ్మల్ని ఎప్పుడూ ‘డార్లింగ్’ అని పిలుస్తూనే ఉన్నాను. ఈరోజు మీరు ఇంత పెద్ద స్థాయికి వచ్చినా నా పిలుపులో ఎలాంటి మార్పు రాలేదు. ఒక సాధారణ హీరోగా కెరీర్ మొదలుపెట్టి.. ఎన్నో అడ్డంకులు, విమర్శలను మీ మౌనంతో, విజయాలతో తిప్పికొట్టారు. ఒక సూపర్‌స్టార్‌గా సినీ రంగాన్ని ఏలి.. ఇప్పుడు తమిళనాడు గౌరవ ముఖ్యమంత్రిగా అత్యున్నత శిఖరాలకు ఎదిగారు” అంటూ విజయ్ ప్రయాణాన్ని కొనియాడారు.
Also Read
- Horror Stories : మళ్లీ హారర్ కామెడీ, హారర్ థ్రిల్లర్స్‌పై బాలీవుడ్ ఫోకస్
- KVN : కేవియన్ ఖాతాలో మరో డిజాస్టర్.. బాక్సాఫీస్ బాంబ్‌గా హైవాన్
- Dhanush OM: రజినీ కోసం స్టార్ హీరో ధనుష్ బిగ్ డెసిషన్.. ‘జైలర్ 2’తో పోటీ వద్దంటూ సంచలన ప్రకటన!
- The Paradise: నాని కెరీర్లోనే రికార్డ్ ఓపెనింగ్ దిశగా ‘ది ప్యారడైజ్’.. రిలీజ్‌కు ముందే కోటి దాటేసిన సినిమా!
“ఈ రోజు మీ పదవి, హోదా మారినా.. మనుషులను ఆదరించే మీ వ్యక్తిత్వం మాత్రం అస్సలు మారలేదు. మిమ్మల్ని కలవడం నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది. ఒకప్పుడు మన మధ్య ఉన్న అదే ఆప్యాయతను మళ్లీ అనుభూతి చెందాను. ఎంజీఆర్ గారి నుంచి జయలలిత అమ్మ వరకు.. స్టాలిన్ అంకుల్ నుండి నా ప్రియ సోదరుడు ఉదయనిధి స్టాలిన్ వరకు ఎందరో ముఖ్యమంత్రులను చూశాం. కానీ, మన రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను ‘డార్లింగ్’ అని పిలవడం నాకు ఎంతో ముచ్చటగా, గర్వంగా అనిపించింది. ఈ మధుర క్షణాలు నా జీవితంలో ఎప్పటికీ నిలిచి ఉంటాయి” అని విశాల్ ఎమోషనల్ అయ్యారు.
తాజావార్తలు
-
Vivo Y600i: వివో Y600i లిస్టింగ్.. 6.87 అంగుళాల డిస్ప్లే, 8,000mAh బ్యాటరీ!
-
India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
-
Horror Stories : మళ్లీ హారర్ కామెడీ, హారర్ థ్రిల్లర్స్‌పై బాలీవుడ్ ఫోకస్
-
Tragedy: స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతి.. 9 మంది ప్రయాణికులు మృతి
-
KVN : కేవియన్ ఖాతాలో మరో డిజాస్టర్.. బాక్సాఫీస్ బాంబ్‌గా హైవాన్
ట్రెండింగ్
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!