జగ్గయ్యపేటలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది.. జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్ రంగాపురం రాఘవేంద్రతో పాటు పలువురు వార్డు కౌన్సిలర్లు సైకిల్ పార్టీలో చేరారు.. వారికి కండువాకప్పి టీడీపీలోకి ఆహ్వానించారు మంత్రి నారా లోకేష్.
ఎన్టీఆర్ జిల్లా, బోదవాడలోని సిమెంట్ కర్మాగారంలో బాయిలర్ పేలిన ఘటనపై సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై సీఎంఓ అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు.
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో ప్రమాదం చోటుచేసుకుంది. సిమెంట్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలి దాదాపు 15 మంది కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వాసులుగా గుర్తించారు.