యంగ్ హీరోయిన్ ప్రియాంక మోహన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.నాచురల్ స్టార్ నాని నటించిన ‘గ్యాంగ్ లీడర్’ చిత్రంతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయిన ఈ భామ.. ఇప్పుడు ఏకంగా పవన్ కల్యాణ్ తో కలిసి ‘ఓజీ’ అనే చిత్రంలో నటిస్తోంది. తాజాగా ఇంస్టాగ్రామ్ లో తన ఫ్యాన్స్ తో ముచ్చటించింది. అందులో ఎక్కువగా తనకు ‘ఓజీ’ గురించే ప్రశ్నలు ఎదురవ్వగా సినిమాపై ఆసక్తికర అప్డేట్స్ ఇచ్చింది. ‘పవన్ కల్యాణ్ ఒక లెజెండ్. మంచి మనిషి. అంతే కాకుండా ఒక గొప్ప నాయకుడు’’ అని ప్రియాంక తెలిపింది. ‘ఓజీ’ చిత్రం గురించి ఏమైనా చెప్పమని అడగగా.. ‘‘ఓజీ మూవీ చాలా బాగా వస్తుంది. మీరంతా ఈ మ్యాజిక్ ని వెండితెరపై చూసే రోజు కోసం ఎదురుచూస్తున్నాను’’ అంటూ ఫ్యాన్స్ లో ఆసక్తిని మరింత పెంచేసింది. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ‘ఓజీ’ మూవీ సెప్టెంబర్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తయ్యింది. బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మీ.. ఈ సినిమాలో విలన్ గా నటిస్తూ మొదటిసారి నేరుగా తెలుగు ప్రేక్షకులను అలరించనున్నారు.
అలాగే తన అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పమని ఫ్యాన్స్ అడగగా.. ‘ఓజీ, సరిపోదా శనివారం, బ్రదర్’ అని ఆమె రివీల్ చేసింది. నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రమే ‘సరిపోదా శనివారం’. తాజాగా నాని పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ గ్లింప్స్ విడుదలయ్యింది. ఈ సినిమా విషయంలో తనకు చాలా ఎగ్జైటింగ్గా ఉందని తెలిపింది. వీటితో పాటు తన స్కిన్ కేర్ రొటీన్ ఏంటి అని ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నకు తను సమాధానమిచ్చింది. ‘‘శుభ్రమైన ఆహారం తినాలి, హైడ్రోటెడ్ గా ఉండాలి. వ్యాయామం చేయాలి. ఇవి కాకుండా నేను ఎక్కువగా బేసిక్ ప్రొడక్ట్స్ ని ఉపయోగిస్తాను. క్లీన్సర్, మాయిశ్చరైజర్ మరియు సన్ బ్లాక్ ఉపయోగిస్తాను’’ అంటూ తన స్కిన్ కేర్ రొటీన్ ని షేర్ చేసుకుంది. ఇప్పటికే తెలుగు, తమిళ చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన ప్రియాంక మోహన్ కి మొత్తంగా ఎన్ని భాషలు వచ్చు అని అడగగా.. ‘‘తెలుగు, తమిళ, కన్నడ, ఇంగ్లీష్, హిందీ’’ అని సమాధానమిచ్చింది. ఇక మరో ఫ్యాన్ తన గోర్లు బాగుంటాయని, ఒకసారి పోస్ట్ చేయండి ప్లీజ్ అంటూ వింత కోరిక కోరాడు. నిజంగానా అంటూ తన చేతివేళ్శను ఫోటో తీసి పోస్ట్ చేసింది.