Pro Kabaddi League 2024: ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్ జట్టు విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్ 32-23తో పాట్నా పైరేట్స్‌పై విజయం సాధించింది. దీంతో హర్యానా జట్టు తొలిసారి ఛాంపియన్‌గా అవతరించింది. దీనితో మూడుసార్లు చాంపియన్‌గా నిలిచిన పాట్నా పైరేట్స్ రికార్డుతో నాలుగోసారి టైటిల్ సాధించాలన్న కల చెదిరిపోయింది. చివరి మ్యాచ్‌లో హర్యానా తరఫున శివమ్ పటారే అత్యధికంగా 9 పాయింట్లు సాధించాడు. అలాగే మహ్మద్రెజా షాద్లు కూడా 7 పాయింట్లు సాధించాడు. మరోవైపు, పాట్నా పైరేట్స్ తరఫున గురుదీప్ మాత్రమే 6 పాయింట్లు సాధించాడు. ఎన్నో అసలు పెట్టుకున్న రెస్ట్ దేవాంక్, అయాన్ లు ఫ్లాప్ అయ్యారు.
Also Read: Koneru Hampi: చరిత్ర సృష్టించిన కోనేరు హంపి.. రెండవసారి ప్రపంచ ర్యాపిడ్ చెస్ టైటిల్ కైవసం
హర్యానా స్టీలర్స్ ఆతని బాగా ప్రారంభించి డిఫెన్స్, రైడింగ్ రెండింటిలోనూ పాయింట్లు సాధించింది. అయితే, పాట్నా పైరేట్స్ జట్టు కూడా వెనుకంజ వేయలేదు. డిఫెన్స్‌లో కూడా వారు అద్భుతంగా రాణించారు. రెండు జట్ల రైడర్లు రాణించలేకపోయినప్పటికీ డిఫెండర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. దీనితో ఇరు జట్ల మధ్య గట్టి పోటీ నెలకొంది. అయితే తొలి 10 నిమిషాల ఆటలో హర్యానా జట్టు 2 పాయింట్లతో ఆధిక్యంలో నిలిచింది. అయితే, దీని తర్వాత అయాన్ మల్టీపాయింట్ తీసుకురావడం ద్వారా పాట్నాను పునరాగమనం చేయడానికి ప్రయత్నించాడు. రెండు జట్లూ నువ్వా.. నేనా.. అన్నట్లుగా సాగిన మ్యాచ్ లో హాఫ్ టైం వరకు స్కోరు 15-12తో హర్యానా స్టీలర్స్‌కు అనుకూలంగా ఉంది.
Presenting to you the 🌟 #𝐏𝐊𝐋𝟏𝟏 𝐂𝐇𝐀𝐌𝐏𝐈𝐎𝐍𝐒 🌟@HaryanaSteelers win their maiden #ProKabaddi title 🏆💙#ProKabaddiOnStar #LetsKabaddi #PKLFinal #HaryanaSteelers #PatnaPirates pic.twitter.com/m5xDX2QJlW
— ProKabaddi (@ProKabaddi) December 29, 2024
ఆ తర్వాత ద్వితీయార్థంలోనూ ఇరు జట్ల మధ్య గట్టి పోటీ నెలకొంది. అయినప్పటికీ హర్యానా జట్టు ఆధిక్యాన్ని కొనసాగించింది. ఇక్కడ పాట్నా పైరేట్స్ రైడర్‌లు నిరంతరం పరాజయం పాలవుతున్నారు. తొలి అరగంటలో దేవాంక్‌కు కేవలం రెండు పాయింట్లు మాత్రమే లభించగా, అయాన్‌కు కూడా రెండు పాయింట్లు మాత్రమే సాధించారు. అయితే, హర్యానా స్టీలర్స్‌కు చెందిన శివమ్ పటారే ఖచ్చితంగా 7 పాయింట్లు సాధించాడు. డిఫెన్స్‌లో హర్యానా స్టీలర్స్ తరఫున మహ్మద్రెజా షాద్లూ అద్భుతంగా ఆడాడు. అతను ట్యాకిల్స్, రైడ్స్ రెండింటిలోనూ పాయింట్లు సాధించాడు. మ్యాచ్‌లో ఎనిమిది నిమిషాల కంటే తక్కువ సమయం ఉండగానే, హర్యానా స్టీలర్స్ పాట్నా పైరేట్స్‌కు ఆలౌట్ చేసి మ్యాచ్‌లో దాదాపు 9 పాయింట్ల ఆధిక్యంలో నిలిచింది. మ్యాచ్ ముగియడానికి 5 నిమిషాల కంటే తక్కువ సమయం ఉండగానే, హర్యానా ఆధిక్యం 8 పాయింట్లు ఉండడంతో చివరకు మ్యాచ్‌ను గెలుచుకుంది.