Colorful RimBook L1 Plus: AMD రైజెన్ 7 7735HS ప్రాసెసర్‌తో.. కలర్ ఫుల్ రిమ్బుక్ L1 ప్లస్ ల్యాప్‌టాప్ విడుదల
- కలర్ ఫుల్ రిమ్బుక్ L1 ప్లస్ ల్యాప్‌టాప్ విడుదల
- AMD రైజెన్ 7 7735HS ప్రాసెసర్
- Wi-Fi 6, Bluetooth 5.2
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ల్యాప్‌టాప్ మార్కెట్లో Colorful Technology కొత్త మోడల్‌ను విడుదల చేసింది. Colorful RimBook L1 Plus పేరుతో వచ్చిన ఈ ల్యాప్‌టాప్‌ను విద్యార్థులు, ఉద్యోగులు, ప్రొఫెషనల్స్, కంటెంట్ క్రియేటర్లు, సాధారణ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. AMD Ryzen 7 ప్రాసెసర్, 2.5K డిస్ప్లే, 16GB LPDDR5 RAM, 512GB SSD వంటి స్పెసిఫికేషన్లతో వచ్చిన ఈ ల్యాప్‌టాప్ మల్టీటాస్కింగ్, ఆఫీస్ పనులు, కంటెంట్ క్రియేషన్, ఎంటర్టైన్మెంట్ వంటి అవసరాలకు ఉపయోగపడేలా ఉంది.
Colorful RimBook L1 Plus ధర
Colorful RimBook L1 Plus ల్యాప్‌టాప్ ధర, మార్కెట్లో అందుబాటులోకి వచ్చే తేదీకి సంబంధించిన వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ధర, లభ్యత వివరాలను త్వరలో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. RimBook L1 Plusలో 16-అంగుళాల IPS 2.5K డిస్ప్లేను అందించారు. ఇది 2560×1600 పిక్సెల్స్ రిజల్యూషన్, 16:10 యాస్పెక్ట్ రేషియోతో వస్తుంది. డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 300 నిట్స్ గరిష్ట బ్రైట్నెస్ను అందిస్తుంది. అలాగే 92.52% స్క్రీన్-టు-బాడీ రేషియో, 100% sRGB కలర్ గామట్ కు సపోర్ట్ చేస్తుంది. 100% sRGB కవరేజ్ కారణంగా ఫోటో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైన్, వీడియో ఎడిటింగ్ వంటి పనులు చేసే క్రియేటర్లకు ఈ డిస్ప్లే ఉపయోగకరంగా ఉంటుంది. 2.5K రిజల్యూషన్ వల్ల టెక్స్ట్, ఫొటోలు, వీడియోలు మరింత షార్ప్‌గా కనిపించే అవకాశం ఉంది.
Also Read
- iQOO Neo 12: iQOO Neo 12 లాంచ్ డేట్ ఫిక్స్.. 9,000mAh బ్యాటరీ, 200MP కెమెరా
- OnePlus Ace 7 Pro: 9000mAh బ్యాటరీతో వన్‌ప్లస్ Ace 7 Pro.. 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5 చిప్సెట్?
- Meta Gets Government Advisory: ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌కు కేంద్రం కీలక సూచనలు.. మెటాకు అడ్వైజరీ జారీ!
- Redmi K100: రెడ్ మీ K100 లాంచ్ ఖాయం.. 10,000mAh బ్యాటరీతో కొత్త ఫోన్!
AMD Ryzen 7 ప్రాసెసర్
పనితీరు కోసం ఈ ల్యాప్‌టాప్‌లో AMD Ryzen 7 7735HS ప్రాసెసర్‌ను అందించారు. గ్రాఫిక్స్ అవసరాల కోసం ఇంటిగ్రేటెడ్ AMD Radeon 680M గ్రాఫిక్స్ ఉన్నాయి. ఈ కాంబినేషన్‌తో ఆఫీస్ అప్లికేషన్లు, బ్రౌజింగ్, మల్టీటాస్కింగ్, కంటెంట్ క్రియేషన్ వంటి పనులను నిర్వహించడానికి ల్యాప్‌టాప్ రూపొందించారు. Colorful RimBook L1 Plusలో 16GB LPDDR5-6400 RAM అందించారు. స్టోరేజ్ కోసం 512GB PCIe Gen4 NVMe SSD ఉంది. వేగవంతమైన SSD కారణంగా ఆపరేటింగ్ సిస్టమ్ బూట్ అవ్వడం, అప్లికేషన్లు ఓపెన్ చేయడం, ఫైళ్లను యాక్సెస్ చేయడం వంటి పనులు వేగంగా జరిగే అవకాశం ఉంది. ఈ ల్యాప్‌టాప్‌లో Windows 11 Home ఆపరేటింగ్ సిస్టమ్ ముందే ఇన్స్టాల్ చేసి వస్తుంది. అలాగే డాక్యుమెంట్లు, స్ప్రెడ్షీట్లు, ప్రజెంటేషన్ల కోసం WPS Office కూడా ప్రీ-ఇన్స్టాల్ చేశారు.
Wi-Fi 6, Bluetooth 5.2
కనెక్టివిటీ విషయానికి వస్తే RimBook L1 Plusలో Wi-Fi 6, Bluetooth 5.2, USB Type-C వంటి ఆప్షన్లు ఉన్నాయి. USB Type-C పోర్ట్ ద్వారా డేటా ట్రాన్స్ఫర్తో పాటు ఛార్జింగ్ సదుపాయం కూడా లభిస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌లో 65Wh బ్యాటరీను అందించారు. ఇది 65W USB Type-C Power Delivery ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. దీంతో అనుకూలమైన USB Type-C ఛార్జర్ ద్వారా ల్యాప్‌టాప్‌ను ఛార్జ్ చేసుకోవచ్చు.
స్లిమ్, తేలికైన డిజైన్
డిజైన్ పరంగా RimBook L1 Plusకు మ్యాట్ మెటల్ టాప్ కవర్‌ను అందించారు. ఇది ల్యాప్‌టాప్‌కు ప్రీమియం లుక్‌ను అందించేలా రూపొందించారు. ల్యాప్‌టాప్ మందం కేవలం 16.65mm కాగా, బరువు సుమారు 1.4kg. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు దీన్ని సులభంగా తీసుకెళ్లడానికి అనుకూలంగా ఉంటుంది.
తాజావార్తలు
-
Niki Prasad History: ఔరా నిఖీ ప్రసాద్.. తొలి భారత క్రికెటర్‌గా అరుదైన రికార్డు.. ఇప్పటివరకు ఎవరి వల్ల కాలేదు!
-
Mydukur Election Suspended: మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు రద్దు.. ఎస్ఈసీ కీలక ప్రకటన
-
Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. కేవలం 45 పైసలకే రూ.10 లక్షల ఇన్సూరెన్స్..!
-
RAPO 23: టాలీవుడ్లోకి రితీష్ దేశ్ ముఖ్
-
Chris Gayle Catch: 47 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే.. గాల్లోకి ఎగిరి స్టన్నింగ్ క్యాచ్.. వీడియో చూస్తే మతిపోవాల్సిందే!
ట్రెండింగ్
-
Cinnamon Plant: మార్కెట్ దాల్చిన చెక్కకు గుడ్ బై.. ఇంట్లోని కుండీలోనే సులువుగా పెంచేయండిలా..
-
Anaya Bangar: శ్రేయస్‌ను చంపేస్తా.. గిల్‌తో డేటింగ్ చేస్తా.. అభిషేక్‌ను పెళ్లి చేసుకుంటా!
-
Josephine Nkomo: మా ఓటమికి కారణం అదే.. టీమిండియాను చూసి చాలా నేర్చుకోవాలి!
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?