CM Chandrababu: పెట్టుబడులు-మౌళిక సదుపాయాలపై సమీక్ష.. కీలక అంశాలు ప్రస్తావించిన సీఎం..
- పెట్టుబడులు-మౌళిక సదుపాయాల శాఖపై సీఎం రివ్యూ..
- వివిధ రకాల కార్పొరేషన్లలో అవకతవకలు జరిగాయన్న అంశంపై చర్చ..
- ఫైబర్ నెట్ కనెక్షన్ల లెక్కలు లేవని చెప్పిన అధికారులు..
- కనెక్షన్ల ఛార్జీల సొమ్మును కూడా దోచేసుకున్నారా.. అంటూ ఆశ్చర్యపోయిన ఏపీ సీఎం..
- అన్ని రకాల కార్పొరేషన్లలో ఆడిటింగ్ చేపట్టాలని సీఎం ఆదేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: పెట్టుబడులు మౌళిక సదుపాయాల శాఖ రివ్యూలో అధికారులు సీఎం చంద్రబాబు దృష్టికి కీలక విషయాలు తీసుకొచ్చారు. వివిధ రకాల కార్పొరేషన్లలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని అధికారులు సీఎం చంద్రబాబుకు చెప్పారు. ఫైబర్ నెట్ కనెక్షన్ల వివరాలను సీఎం చంద్రబాబు అడిగితే అవి లేవని అధికారులు చెప్పడంతో.. కనెక్షన్ల సొమ్ములను కూడా దోచుకున్నారా అంటూ ఆశ్చర్యపోయారు. అన్ని రకాల కార్పొరేషన్లలో ఆడిటింగ్ చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఫైబర్ నెట్ కార్పొరేషన్‌ను కడప వైసీపీ కార్యకర్తలతో నింపేశారని ప్రభుత్వం గుర్తించింది.
Read Also: Sheikh Hasina: మరికొన్ని రోజులు ఇండియాలోనే షేక్ హసీనా.. ఏర్పాట్లు సిద్ధం..
Also Read
- Andhra Pradesh Job Calendar: ఏపీలో రెండో దశ జాబ్ క్యాలెండర్.. సీఎస్ కీలక సమావేశం..
- Tirupati Drugs Case : తిరుపతి డ్రగ్స్ కేసులో టీటీడీ ఉద్యోగి అరెస్ట్..
- CM Chandrababu : వియత్నాం బోటు ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారం
- Nara Lokesh South Korea visit: సౌత్ కొరియాలో మంత్రి లోకేష్ పర్యటన.. 50కి పైగా కంపెనీలతో చర్చలు
ఇక, సగం మంది ఉద్యోగులు పనిచేయకుండానే జీతం తీసుకున్నట్లుగా సమీక్షలో తేలింది. ఫైబర్ నెట్ పేరుతో 1500 కోట్ల రూపాయలు రుణం తీసుకొని.. పక్కదారి పట్టించారని చంద్రబాబుకు అధికారులు వివరించారు. ఫైబర్ నెట్ కనెక్షన్ల నెలవారీ ఛార్జీల డబ్బులను కూడా సొంతానికి వాడేసుకున్నారని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సీజ్ చేసి ఉన్న ఫైబర్ నెట్ కార్యాలయాన్ని తెరిచి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకోవాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఫైబర్ నెట్ కనెక్షన్లు కూడా 9 లక్షల నుంచి 5 లక్షలకు తగ్గిపోయాయని అధికారులు వివరించారు. మరోవైపు.. పోర్టుల నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు ఏపీ సీఎం.. రామయాపట్నం పోర్టు కాంట్రాక్టర్ విషయంలో కొన్ని అభ్యంతరాలు వ్యక్తం కాగా.. కాంట్రాక్టర్ విషయంలో అభ్యంతరాలున్నా.. గత ప్రభుత్వం చేసిన తప్పులు చేయలేమన్నారు చంద్రబాబు. పోర్టుల నిర్మాణాలను వీలైనంత త్వరగా పూర్తి చేసేలా దృష్టి సారించాలని వ్యాఖ్యానించారు సీఎం చంద్రబాబు నాయుడు.
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్‌గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్‌గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!