ఈ రోజు జీబీఎస్ పై సమీక్ష సమావేశం నిర్వమించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. జీబీఎస్ కేస్ లు వ్యాధి లక్షణాలపై అధికారులతో చర్చించారు.. ఈ వ్యాధి కట్టడికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.. ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు.. వ్యాధి నిర్ధారణ పరీక్షలపై దృష్టి పెట్టాలని సూచించారు..
ఏపీలో గులియన్-బారీ సిండ్రోమ్ (జీబీఎస్) కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం 17 జీబీఎస్ కేసులు నమోదయ్యాయి. ఇంకా కొన్ని చోట్ల కేసులు పెరుగుతున్నాయి. ఆరు జిల్లాల్లో జీబీఎస్ కేసులు నమోదయినట్టు అధికారులు గుర్తించారు. విజయనగరం, విజయవాడ, అనంతపురంలో ఒక్కో కేసు చొప్పున.. కాకినాడలో 4, గుంటూరు మరియు విశాఖలలో 5 చోప్పున జీబీఎస్ కేసులు నమోదు అయ్యాయి. ఈ నరాల సంబంధిత వ్యాధి కేసులు రాష్ట్రంలో ఒక్కసారిగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. లక్ష మందిలో ఒక్కరికి మాత్రమే సోకే…