CM Chandrababu: ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. వారితో అప్రమత్తంగా ఉండాలి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: తెలుగుదేశం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జ్‌లు, గ్రామస్థాయి కార్యకర్తలతో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, ప్రభుత్వ కార్యక్రమాల అమలు, ప్రతిపక్షాల విమర్శలకు సమాధానం వంటి పలు అంశాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ నెల 29న ఘనంగా నిర్వహించామని, పార్టీకి సేవలందించిన సీనియర్ కార్యకర్తలను సత్కరించామని తెలిపారు. రాజకీయ సాధికారతను పెంపొందిస్తూ, జనాభా దామాషా ప్రకారం అన్ని వర్గాలకు పదవులు కేటాయించి సమర్థవంతమైన నాయకత్వాన్ని తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. తాను ప్రతి పర్యటనలో కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ మార్గదర్శకత్వం అందిస్తున్నానని చెప్పారు.
Also Read
- AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
- Amaravati - Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
- AP Government: ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. EHSపై ప్రభుత్వం కీలక నిర్ణయం
- Minister Dola Veeranjaneya Swamy : చలో విజయవాడపై మంత్రి డోలా ఫైర్.. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇచ్చాం.. అయినా ఆందోళన ఎందుకు?
ప్రతి నెల మొదటి తేదీన “పేదల సేవలో” కార్యక్రమం ద్వారా పింఛన్లు పంపిణీ చేస్తున్నామని, ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు చంద్రబాబు. అమరావతిని రాజధానిగా కేంద్రం చట్టబద్ధం చేయనున్న నేపథ్యంలో, ఈ విషయాన్ని గర్వంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. గత పాలకులు మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని గందరగోళానికి గురి చేశారని విమర్శించారు. రాజధాని అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణలో ప్రస్తుతం మంచి అవకాశాలు ఉన్నాయని, అమరావతి నిర్మాణం రైతులు ఇచ్చిన భూములతోనే జరుగుతోందని స్పష్టం చేశారు. ప్రతిపక్ష వైసీపీ చేస్తున్న విమర్శలను సమర్థంగా తిప్పికొట్టాలని నాయకులకు సూచించారు.
ప్రభుత్వ పథకాలపై మాట్లాడుతూ, పీ4 పథకం కింద 10 లక్షల కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకున్నారని, ఏడాదిలోనే 2 లక్షల కుటుంబాల్లో మార్పు తీసుకురాగలిగామని తెలిపారు చంద్రబాబు… ఉద్యోగులకు ప్రతి నెల మొదటి తేదీన జీతాలు చెల్లిస్తున్నామని, బకాయిలను కూడా పరిష్కరిస్తున్నామని చెప్పారు. చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా 2.5 లక్షల గృహప్రవేశాలు నిర్వహించామని, 22 నెలల్లో 5.5 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామని తెలిపారు. టిడ్కో ఇళ్ల కోసం అడ్వాన్స్ చెల్లించిన వారికి రూ.174 కోట్లను తిరిగి చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు కేంద్రం భారీగా నిధులు కేటాయించిందని, నక్కపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశామని తెలిపారు. అలాగే దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు.
రాయలసీమ అభివృద్ధి, నీటి ప్రాజెక్టులపై కూడా వివరించారు చంద్రబాబు. పట్టిసీమ ప్రాజెక్ట్ ద్వారా కృష్ణా డెల్టాకు నీరు అందిస్తున్నామని, తుంగభద్ర, శ్రీశైలం ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. రాయలసీమలో హార్టికల్చర్ అభివృద్ధికి పూర్వోదయ పథకం దోహదం చేస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తల పట్ల ప్రజాప్రతినిధులు సత్ప్రవర్తనతో ఉండాలని, వారిని ఆప్యాయంగా కలుపుకొని ముందుకు సాగాలని సూచించారు. అలాగే నేర చరిత్ర ఉన్న వ్యక్తులు, నీతిమాలిన చర్యలకు పాల్పడేవారిపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని ప్రతి స్థాయిలో ఖండించాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!