AP Panchayat Raj Wins National Awards 2026: ఏపీ పంచాయతీరాజ్ శాఖకు జాతీయ అవార్డులు.. పవన్ కల్యాణ్ హర్షం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Panchayat Raj Wins National Awards 2026: ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మరోసారి జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచింది. వరుసగా రెండో ఏడాది దీనదయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ జాతీయ పురస్కారాలకు ఎంపిక కావడం రాష్ట్రానికి గర్వకారణమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆనందం వ్యక్తం చేశారు.. ఈ విజయాలు గ్రామీణాభివృద్ధి దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలకు స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించిన పంచాయతీగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలంలోని బొక్కసం పాలెం జాతీయ స్థాయిలో ప్రథమ స్థానాన్ని దక్కించుకోవడం విశేషమని పవన్ అన్నారు. అదేవిధంగా సుపరిపాలన విభాగంలో విశాఖపట్నం జిల్లా శృంగవరం గ్రామ పంచాయతీ మొదటి స్థానంలో నిలవడం అభినందనీయమని తెలిపారు.
గ్రామ స్థాయిలో పేదరిక నిర్మూలన, జీవనోపాధి మెరుగుదల అంశాల్లో వైఎస్ఆర్ కడప జిల్లా చెమ్ముళ్లపల్లి గ్రామం జాతీయ స్థాయిలో రెండో స్థానం సాధించగా, మౌలిక సదుపాయాల కల్పనలో స్వయం సమృద్ధి సాధించిన పంచాయతీల్లో ప్రకాశం జిల్లా గుండమల గ్రామ పంచాయతీ మూడో స్థానంలో నిలిచింది. ఇక, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గ పరిధిలోని కుప్పం మండలం జాతీయ స్థాయిలో మూడో అత్యుత్తమ మండలంగా ఎంపిక కావడం ప్రత్యేకంగా నిలిచింది. గత ఏడాది కూడా పంచాయతీరాజ్ శాఖ వివిధ విభాగాల్లో నాలుగు అవార్డులు గెలుచుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
Also Read
- AP Drought Mandals 2026: కరువు కోరల్లో ఏపీ.. 21 జిల్లాల్లో 388 మండలాలు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
- Amaravati Construction: అమరావతి నిర్మాణంలో కీలక సమస్య..! కార్మికులపై అధికారుల దృష్టి
- AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
- Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
ఈ విజయాలకు కారణమైన గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యులు, అధికారులు అందరికీ పవన్ కల్యాణ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. గ్రామీణాభివృద్ధికి తమ కృషిని గుర్తించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్‌కు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ అవార్డులు తమపై మరింత బాధ్యతను మోపాయని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి పనిచేస్తుందని స్పష్టం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ వరుసగా రెండో ఏడాది దీనదయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ జాతీయ పురస్కారాలకు ఎంపిక కావడం ఆనందంగా ఉంది. ముఖ్యంగా మహిళలకు స్నేహపూర్వక వాతావరణంగల పంచాయతీగా తిరుపతి జిల్లా, శ్రీకాళహస్తి మండల పరిధిలోని బొక్కసం పాలెం జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం… pic.twitter.com/sKlL689MZQ
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) March 31, 2026
తాజావార్తలు
-
Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
-
Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
-
South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!