SS Rajamouli : తెలుగు సినిమాలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి.. ఏం చేసినా సెన్సేషన్ అవుతుందనే విషయం తెలిసిందే. దర్శకుడిగా ఇప్పటికే అగ్ర స్థానంలో నిలబడ్డ రాజమౌళి.. ఇప్పుడు నటుడిగా మారాడు. మనకు తెలిసిందే కదా.. జక్కన్న చాలా యాడ్స్ లలో నటిస్తుంటాడు. తెలుగులో కొన్ని సినిమాల్లో చిన్న పాత్రల్లోనూ మెరిశారు. ఇప్పుడు బాలీవుడ్ వెబ్ సిరీస్ లో నటించాడు. బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డైరెక్ట్ చేసిన బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ సిరీస్ లో కనిపించాడు రాజమౌళి. ఈ సిరీస్ ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో రాజమౌళితో పాటు అమీర్ ఖాన్ కూడా కనిపించాడు. ఈ సిరీస్ లోనూ రాజమౌళి డైరెక్టర్ గానే కనిపించాడు.
Read Also : Rithika Nayak : మిరాయ్ హీరోయిన్ రితిక నాయక్ బ్యాక్ గ్రౌండ్ ఇదే
హీరో కావాలనుకున్న కుర్రాడు ఎలాంటి కష్టాలు పడ్డాడు.. ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి అనే నేపథ్యంలో ఈ సిరీస్ తీశాడు జక్కన్న. రాజమౌళి డైరెక్షన్ లో అమీర్ ఖాన్ నటించే సినిమా షూటింగ్ దగ్గరకు సదరు కుర్రాడు వస్తాడు. అప్పుడు రాజమౌళి అమీర్ ఖాన్ కు సీన్ వివరిస్తూ కనిపించాడు. ఈ ఒక్క షాట్ ట్రైలర్ లో కనిపించింది. చూస్తుంటే ఈ సిరీస్ లో రాజమౌళి ఎక్కువ సేపు కనిపించేలా ఉన్నాడు. రాజమౌళి సినిమాల్లో ఏదైనా ఛాన్స్ వస్తుందేమో అని ఆ కుర్రాడు వస్తాడంట. వీరిద్దరి మధ్య కొన్ని సీన్లు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మహేశ్ బాబు హీరోగా వస్తున్న ఎస్ ఎస్ ఎంబీ 29తో ఫుల్ బిజీగా ఉన్నాడు జక్కన్న. ఇలాంటి టైమ్ లో ఈ వెబ్ సిరీస్ లో నటించాడంటే కేవలం షారుక్ కోసమే అంటున్నారు నెటిజన్లు. లేదంటే రాజమౌళి ఏంటి.. ఆర్యన్ ఖాన్ డైరెక్షన్ లో చేయడమేంటని ముక్కున వేలేసుకుంటున్నారు.
Read Also : Shivani Nagaram : శివానీ నగరం ఆ బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిందని తెలుసా..?