CM Chandrababu Delhi Tour: మరోసారి ఢిల్లీ బాట.. నేడు హస్తినకు సీఎం చంద్రబాబు
- మరోసారి ఢిల్లీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
- ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం..
- ఈ రోజు.. రేపు రెండు రోజుల పాటు ఢిల్లీలోనే మకాం..
- రేపు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీకానున్న ఏపీ సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu Delhi Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మరోసారి ఢిల్లీ బాటపట్టనున్నారు.. ఈ రోజు.. మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో హస్తిన చేరుకోనున్నారు చంద్రబాబు.. ఈ రోజు, రేపు రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే మకాం వేయనున్నారు.. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు కేంద్రమంత్రులతో సమావేశం కానున్నారు ఏపీ సీఎం.. రేపు ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ కోరినట్టుగా తెలుస్తుండగా.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌తోనూ చంద్రబాబు సమావేశం అవుతారు.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై ఢిల్లీ పెద్దలతో చర్చలు జరపనున్నారు.. పోలవరం ప్రాజెక్టు.. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులతో పాటు కొత్త రుణాలపై ప్రధాని మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది.. మరోవైపు.. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి హయాంలో చేసిన రుణాలను రీషెడ్యూల్ చేయాల్సిందిగా కోరనున్నట్టుగా తెలుస్తోంది.
Read Also: Polavaram Project: పోలవరం ప్రాజెక్టుపై విదేశీ నిపుణుల కీలక సూచనలు.. డిజైన్ మార్పులతో..!
Also Read
మరోవైపు.. రాష్ట్రంలో పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షించి.. పరిశ్రమలు ఏర్పాటు చేయడంపై ఫోకస్ పెట్టారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పెట్టుబడుల సాధనే ప్రధాన లక్ష్యంగా దాదాపు ఆరేడు శాఖల్లో కొత్త పాలసీల రూపకల్పనపై కసరత్తు మొదలుపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని కలిగించి రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేందుకు విస్తృత ప్రయత్నాలు జరుపుతున్నారు ముఖ్యమంత్రి. ఒకవైపు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, మరోవైపు ప్రైవేటు సంస్థల ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడుల తెచ్చేలా ప్రయత్నాలు సాగుతున్నాయి.. గతంలో వెనక్కి వెళ్లిన సంస్థలను మళ్లీ రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీకానున్నారు టాటా గ్రూపు ఛైర్మన్ నజరాజన్ చంద్రశేఖరన్. ఉదయం 10.30 గంటలకు టాటా గ్రూప్ ఛైర్మన్‌తో సమావేశం జరగనుంది.. అనంతరం సీఎంతో భేటీకానున్నారు CII ప్రతినిధుల బృందం. CII డీజీ చంద్రజిత్ బెనర్జీ నేతృత్వంలో ముఖ్యమంత్రితో భేటీకానున్నారు సీఐఐ ప్రతినిధులు. రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు ప్రభుత్వం తీసుకురానున్న నూతన పారిశ్రామిక విధానంపై సీఐఐ ప్రతినిధులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్చించనున్నారు.
తాజావార్తలు
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
Roshan Kanakala: ప్రేమ, మిస్టరీ, సైన్స్ ఫిక్షన్.. రోషన్ కనకాల కొత్త సినిమా గ్రాండ్ లాంచ్!
-
India vs England: చేజారిన టీ20 సిరీస్.. రోహిత్-కోహ్లీ రీఎంట్రీ.. ఇక ఇంగ్లండ్‌పై ప్రతీకారమే మిగిలింది..!
-
Srileela Trolling : శ్రీలీలకు అవమానం.. లెనిన్ నుండి తప్పుకోవడం ప్లస్ అంటూ ట్రోలింగ్
-
ASUS Vivobook 14: ఆసుస్ వివో బుక్ 14, 15 భారత్‌లో లాంచ్.. Intel AI ప్రాసెసర్, 17 TOPS NPU, DDR5 RAM
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!