ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ముగిసింది. మరికాసేపట్లో సీఎం చంద్రబాబు ఢిల్లీ నుంచి కర్నూల్ బయలుదేరనున్నారు. ఢిల్లీ పర్యటనలో రెండు రోజుల పాటు వరుస భేటీలతో చంద్రబాబు బిజీ బిజీగా గడిపారు. కేంద్రమంత్రులు అమిత్ షా, అశ్విని వైష్ణవ్, మన్సుఖ్ మాండవీయ, సీఆర్ పాటిల్, నిర్మలా సీతారామన్‌లను చంద్రబాబు కలిశారు. రాష్ట్రాభివృద్ధికి సహకారం, రంగాల వారీగా పెండింగ్ అంశాలపై కేంద్రమంత్రులకు విజ్ఞాపనలు అందజేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి అంశాలకు సంబంధించి జనశక్తి శాఖ…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. మరోసారి హస్తిన పర్యటనకు సిద్ధం అయ్యారు.. రేపు ఉదయం అమరావతి నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు చంద్రబాబు. ఉదయం.. 9.45కి విజయవాడ ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీకి బయల్దేరి.. ఉదయం 11.45 కు ఢిల్లీ చేరుకుంటారు సీఎం చంద్రబాబు.. ఇక, మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీకానున్నారు.. ఆ తర్వాత, కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్, ఢిల్లీ మెట్రో…
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రెండు రోజులు ఢిల్లీలో పర్యటించనున్నారు. మంగళ, బుధవారాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. రాష్ట్ర ప్రాజెక్టులు, నిధులపై కేంద్ర మంత్రులతో సీఎం చర్చించనున్నారు. మాజీ ప్రధాని పీవీ సంస్మరణ సభ, సీఐఐ బిజినెస్ మీట్‌లో చంద్రబాబు పాల్గొననున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, మంత్రులు అశ్వినీ వైష్ణవ్, సీఆర్ పాటిల్, మన్సుఖ్ మాండవీయ,…
వ్యక్తిగత పర్యటన నిమిత్తం కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం అర్ధరాత్రి దేశరాజధాని ఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయంలో సీఎంకు కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్.. ఎంపీలు లావు శ్రీకృష్ణ దేవరాయలు, కలిశెట్టి అప్పల నాయుడు.. పార్టీ సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్ రావు తదితరులు స్వాగతం పలికారు. రాత్రి ఢిల్లీలో బస చేసిన సీఎం చంద్రబాబు.. నేడు పలువురు కేంద్రమంత్రులతో భేటీ కానున్నారు. రాష్ట్ర అభివృద్ధి అంశాలతో పాటు రాజకీయ…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ఇవాళ్టితో ముగియనుంది.. దీంతో ఈరోజు అర్ధరాత్రికి దేశ రాజధాని ఢిల్లీ చేరుకోనున్నారు ఏపీ సీఎం.. అయితే, రేపు ఢిల్లీలో ఏపీ సీఎం కీలక సమావేశాలు ఉన్నాయి..
నేడు దేశ రాజధాని ఢిల్లీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. సాయంత్రం 4.30కు విజయవాడ నుంచి ఢిల్లీ పర్యటనకు బయల్దేరనున్నారు. సాయంత్రం 6.30కి సీఎం, డిప్యూటీ సీఎం ఢిల్లీ చేరుకోనున్నారు. రాత్రి 7 గంటలకు ఢిల్లీలో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కుమారుడి రిసెప్షన్‌కు హాజరవుతారు. ఈరోజు రాత్రికి ఇద్దరు ఢిల్లీలోనే బస చేస్తారు. బుధవారం ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసే…
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. మాజీ ప్రధాని వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. కాసేపట్లో వాజపేయి సమాధి సదైవ్ అటల్ వద్ద నివాళులు అర్పించనున్నారు. ఇక ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరిగే ఎన్డీఏ కూటమి పక్షాల నేతల సమావేశానికి హాజరుకానున్నారు చంద్రబాబు..
రెండు రోజుల పర్యటనకు ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రులతో సమావేశమవుతూ బిజీబిజీగా ఉన్నారు. సోమవారం ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు.
కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని సహా కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ కానున్నారు. సాయంత్రం 4.45గంటలకు ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. సాయంత్రం 6:15కి రైల్వే, సమాచార ప్రసారాల శాఖల మంత్రి అశ్వని వైష్ణవ్‌తో భేటీ కానున్నారు.
నేడు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు.. ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోడీతో భేటీకానున్న ఆయన.. సాయంత్రం 6 గంటలకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశం కానున్నారు.. ఇక, రాత్రి 7 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీకానున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.