RGV: గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ని ప్రశంసిస్తూ.. రామ్ గోపాల్ వర్మ ట్వీట్ వైరల్
- ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్యలో సూత్రదారి లారెన్స్ బిష్ణోయ్
- గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ని ప్రశంసిస్తూ రామ్‌గోపాల్ వర్మ ట్వీట్
- హీరోల కంటే బాగున్నాడని కొనియాడిన ఆర్‌జీవీ
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ట్వీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య తర్వాత సల్మాన్ ఖాన్ భద్రతను పెంచారు. ఇదిలా ఉంటే ప్రముఖ చిత్రనిర్మాత రామ్ గోపాల్ వర్మ, గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌పై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్టులు చర్చనీయాంశమవుతున్నాయి. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సినిమా ప్రస్తుత నటుల కంటే అందంగా కనిపిస్తాడని రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నాడు. లీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను రెచ్చగొట్టే విధంగా రామ్‌గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ హెచ్చరికలకు తగినట్లుగా స్పందించాలని, తాను పిరికివాడు కాదని నిరూపించుకోవాలని పేర్కొన్నాడు. “సల్మాన్ ఖాన్ బిష్ణోయ్ కి సూపర్ కౌంటర్ థ్రెట్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. లేదంటే టైగర్ స్టార్ పిరికితనంలా అనిపిస్తుంది. బీతో పోలిస్తే తాను పెద్ద సూపర్ హీరో అని అభిమానులకు నిరూపించాల్సిన అవసరం సల్మాన్ ఖాన్ పై ఉంది” అని రాసుకొచ్చాడు.
READ MORE: Railway: రైలులో ప్రయాణించే రోగులకు రైల్వే ప్రత్యేక రాయితీ.. ఏ రోగులకు ఎంత రాయితీ తెలుసా..?
Also Read
- Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
- Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
- Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
లారెన్స్ బిష్ణోయ్‌లాగా ఎవరూ లేరు
ఇక మరో ట్వీట్ లో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ లాగా ఏ ఫిల్మ్ స్టార్ లేడు అని కూడా ఆర్జీవీ అన్నాడు. ఈ సందర్భంగా అతనికి సంబంధించిన ఓ ఫొటోను కూడా ఆర్జీవీ పోస్ట్ చేశాడు. “ఓ అతిపెద్ద గ్యాంగ్‌స్టర్ పై ఎవరైనా సినిమా తీయాలని అనుకుంటే.. దావూద్ ఇబ్రహీంలాగానో, చోటా రాజన్ లాగానో ఉండే వ్యక్తిని తీసుకోరు. కానీ ఇతన్ని చూడండి. బీ కంటే బాగా కనిపించే ఏ ఫిల్మ్ స్టార్ ని నేను చూడలేదు” అని పేర్కొన్నాడు. 1998లో సల్మాన్ ఖాన్ కృష్ణ జింకను వేటాడిన సమయంలో లారెన్స్ బిష్ణోయ్ వయసు కేవలం ఐదేళ్లని, అలాంటి వ్యక్తి 25 ఏళ్లుగా ప్రతీకారం కోసం చూస్తుండటం ఆశ్చర్యంగా ఉందని ఈ మధ్యే రామ్‌గోపాల్ వర్మ ట్వీట్ చేసిన విషయం విదితమే.
READ MORE:Tollywood: తెలుగు స్టార్ హీరోల సినిమాల లైనప్ ఇదే
If a film is based on the BIGGEST GANGSTER , no film maker will cast a guy who looks like DAWOOD IBRAHIM or CHOTA RAJAN ..But here , I don’t know a single FILM STAR who is more GOOD LOOKING than B pic.twitter.com/jbZubaTtzY
— Ram Gopal Varma (@RGVzoomin) October 15, 2024
తాజావార్తలు
-
PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
-
Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
ట్రెండింగ్
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..