ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (నీటి పారుదల శాఖ) ఆదిత్యనాథ్ దాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం కీలక ఆదేశాలు ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ పైన పడే ప్రభావంపై ఐఐటీ హైదరాబాద్ టీంతో నివేదిక తయారు చేయించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు.
ఇసుక, లిక్కర్ పాలసీపై ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో ఇసుక, లిక్కర్ పాలసీల్లో ఎవరు వేలు పెట్టడానికి లేదు.. ఉచిత ఇసుక ప్రజలకు అందుబాటులో ఉండాల్సిందేనని అన్నారు. ట్రాక్టర్లు, ఎద్దుల బండ్లతో ఇసుక తీసుకెళ్లే వాళ్ళ మీద కేసులు పెట్టొద్దు.. ఎడ్లబండితో ఇసుక తీసుకువెళ్లే వారిపై గ్రామాల్లో రైతులు మీద పెత్తనం చేయొద్దని సీఎం సూచించారు.
రుణమాఫీ పథకం విధివిధానాలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో చర్చించారు. ఖరీఫ్ 2024 నుండి అమలు అయ్యే పంటల భీమా విధివిధానాలపై దిశా నిర్దేశం చేశారు. టెండర్లలో పేర్కొనే నిబంధనలు, ముందుకు వచ్చే కంపెనీలకు ఉన్న అర్హతలు.. మున్నగునవన్నీ ఒకటికి రెండు సార్లు పరిశీలించుకొని, రైతులు పంటనష్టపోయిన సందర్భములో ఈ భీమా పథకం వారిని ఆదుకొనే విధంగా ఉండాలని మంత్రి తెలిపారు. పథక అమలుకు ఆదర్శ రైతులు, రైతు సంఘాల ప్రతినిధులతో ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన సమావేశాలు…
సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ధరణిపై నిర్వహించిన సమీక్ష కాసేపటి క్రితమే ముగిసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ధరణి పోర్టల్ రూప కల్పన ఎవరికి ఇచ్చారు. టెండర్ పిలిచారా? ఏ ప్రాతిపదికన వెబ్సైట్ క్రియేట్ చేసేందుకు అవకాశం ఇచ్చారని అధికారులను ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 18లక్షల 46వేల 416 మందికి ఇంకా పాస్ బుక్స్ ఇవ్వలేదని పేర్కొన్నారు.