Chandrababu: మహానాడుపై చంద్రబాబు సంచలన నిర్ణయం
- మహానాడుపై చంద్రబాబు సంచలన నిర్ణయం
- వర్చువల్ పద్ధతిలో నిర్వహించాలని ఆదేశం
- ఎన్టీఆర్ భవన్లో స్టేజీ ఏర్పాటు చేయాలని సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ప్రపంచ దేశాలు ఆర్థికంగా కొట్టిమిట్టాడుతున్నాయి. చమురు, గ్యాస్ కొరతతో అన్ని దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ పౌరులకు పొదుపు మంత్రం పాటించాలని సూచించారు. ఇప్పటికే ప్రధాని మోడీ దగ్గర నుంచి రాష్ట్రాల వరకు అదే సూత్రాన్ని పాటిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మహానాడు-2026 వర్చువల్ పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టే మహానాడు కార్యక్రమం ఈసారి రెండు రోజుల పాటు వర్చువల్ పద్ధతిలో నిర్వహించాలని ఆదేశించారు. రాష్ట్ర కమిటీ సభ్యులు అంతా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉండాలని సూచించారు.
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
పొదుపు చర్యల్లో భాగంగా చంద్రబాబు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్టీఆర్ భవన్లో స్టేజీ ఏర్పాటు చేసి ఆన్లైన్లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,845 క్లస్టర్లలో స్క్రీన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎన్టీఆర్ భవన్లో పొలిట్‌బ్యూరో సభ్యులు పాల్గొనేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఈ నెల 27, 28న పార్టీ పండుగ మహానాడు కార్యక్రమం జరగనుంది.
ఫిబ్రవరి 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమయ్యారు. అనేక మంది ప్రభుత్వ పెద్దలు కూడా చనిపోయారు. దీనికి ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడులు చేసింది. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని కూడా మూసేసింది. దీంతో ప్రపంచ దేశాలకు వెళ్లే నౌకలు నిలిచిపోయాయి. దీంతో చమురు, గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఆయా దేశాల్లో పొదుపు మంత్రం పాటిస్తుండగా.. ప్రస్తుతం భారత్‌లో అమలవుతోంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!