కోవర్టు నాని ఊసరవెల్లి.. లాగా బిహేవ్ చేస్తున్నాడని కేశినేని నానిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అబ్బా కొడుకులు అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ఆయారం… గాయారం టైప్ అని.. తిన్నింటి వాసాలు లెక్కపెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో కట్టిన ప్రతి ఫ్లై ఓవర్ చంద్రబాబు కట్టించిందేనని తెలిపారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవాలయం ఫ్లై ఓవర్ కట్టడానికి తనకు సంబంధించిన సోమా కంపెనీకి ఇవ్వకపోతే ఇబ్బంది పెట్టాడని.. చంద్రబాబు పిలిచి వార్నింగ్ ఇస్తే అప్పుడు సైలెంట్ అయ్యాడని పేర్కొన్నారు. కోవర్ట్ భవన్ లో కూర్చుని ఎంపీ నిధుల్లోంచి కమిషన్లు తీసుకున్నావు.. తాను నిరూపిస్తానని అన్నారు.
Read Also: Minister Venu: రాష్ట్ర ప్రభుత్వం కుల గణన కార్యక్రమాన్ని సాహసోపేతంగా నిర్వహిస్తోంది..
కోవర్ట్ నాని మాత్రం ఎంపీ నిధుల్లో లంచాలు తీసుకున్నాడని బుద్ధా వెంకన్న ఆరోపించారు. నీతో బుద్ది ఉన్నవాడు ఎవ్వరూ చర్చలకు వస్తారా? అని కేశినేనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, లోకేష్ గురించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే వీపు విమానం మోత మోగుతుందని మండిపడ్డారు. ముసుగు తీసెయ్ కోవర్ట్ నాని.. ఇంకా ముసుగు ఎందుకు అని అన్నారు. 10 సంవత్సరాలు ఎంపీగా చేశావు అంటే.. ప్రజలతో ఎంతామమేకమై ఉంటారు.. కానీ నీ జాతకం అందరికీ తెలుసు అని విమర్శించారు. తిరుపతిలో విజిలెన్స్ వాళ్ళు పట్టుకుని నీ జాతకాన్ని బయటపెట్టారని తెలిపారు. అమరావతిని అభివృద్ధి చేద్దామని అనుకుంటే.. అప్పుడు ఏమి మాట్లాడకుండా ఇప్పుడు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నావని దుయ్యబట్టారు. నీది నరం లేని నాలుక అని విమర్శలు చేశారు.
Read Also: Jogi Ramesh: చంద్రబాబు, పవన్ ఎవరు కలిసి వచ్చినా.. జగన్ ఒక్కరే సమాధానం
ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు మెగాస్టార్ ని పొగిడావు.. బయటకు రాగానే తిట్టావని బుద్ధా వెంకన్న కేశినేని నానిపై ఆరోపణలు గుప్పించారు. ఇప్పుడు టీడీపీలో కూడా అదే చేశావన్నారు. అన్ని చోట్ల తప్పుడు మనిషిగానే ఉన్నాడని మండిపడ్డారు. ప్రతి దాంట్లో చంద్రబాబుని బ్లాక్ మెయిల్ చేసేవాడని ఆరోపించారు. చంద్రబాబు ఎక్కడ అవినీతి మచ్చ పడలేదు.. కానీ నీ మీద అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. మొన్నటి చంద్రబాబు కేస్ కూడా జగన్ అక్రమ కేసుల్లో ఇరికించి ఇబ్బందులు పెడితే ప్రపంచ దేశాల్లో ఆయనకు అండగా నిలిచారని పేర్కొన్నారు. వైసీపీకి నాని బరువు తప్పా… ఏమి ఉపయోగం లేదని ఆరోపించారు. ఇక నుంచి చెత్త వాగుడు, పిచ్చి వాగుడు వాగితే ఊరుకునేది లేదని బుద్ధా వెంకన్న హెచ్చరించారు. నేను చంద్రబాబుకి భక్తుడిని.. నాకు రాజకీయ బిక్ష పెట్టారని తెలిపారు. చంద్రబాబు మీద ఎవ్వరూ మాట్లాడినా రియాక్ట్ అవుతానని బుద్ధా వెంకన్న పేర్కొన్నారు.