AP Free Bus Scheme: ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం.. రాష్ట్రంలోని మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేస్తోంది.. ఇప్పటికే ఆగస్టు 15వ తేదీ నుంచి ఈ స్కీమ్ అమలు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.. అయితే, ఈ పథకంలో మరో ముందడుగు పడినట్టు అయ్యింది.. ఆర్టీసీలో మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి స్త్రీ శక్తి అని పేరు పెట్టారు. మహిళలకు జీరో ఫేర్ టికెట్ అందిస్తారు. టికెట్ పై స్త్రీ శక్తి అని ముద్రిస్తారు. ప్రస్తుతం కండక్టర్లకు స్త్రీ శక్తి టికెట్ పై శిక్షణ ఇస్తున్నారు.. రాష్ట్ర మంతా యూనిట్ గా చేసుకుని ఉచిత ప్రయాణం మహిళలకు ఇవ్వాలనే అలోచన లో ప్రభుత్వం ఉంది.. అయితే, ఈ విషయం పై ఇంకా పూర్తి స్థాయిలో స్పష్టత ఇవ్వలేదు.. వచ్చే ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించనుంది ప్రభుత్వం. ఆగస్టు 15వ తేదీ నుంచి ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అమలుకానున్న విషయం విదితమే..
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
ఇక, మహిళలు ఉచిత బస్సు సన్నద్ధతపై బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించిన ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు.. డిపో మేనేజర్లకు దిశా నిర్దేశం చేశారు.. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశంపై కూడా చర్చించాం. ఎక్కువ మంది మహిళలు ఉపయోగించుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో బస్సులు మెయింటినెన్స్ పై సూచనలు చేశాం. మొదట్లో ఎక్కువ మంది మహిళలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఒత్తిడి ఎలా తట్టుకోవాలన్నది కూడా చర్చించామని తెలిపారు.. డ్రైవర్లు, కండక్టర్ల వరకూ ఎక్కువ బాధ్యత ఉంటుంది. త్వరలో 1,050 కొత్త బస్సులు రానున్నాయి. ప్రతి ఏటా కొత్త ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయి. డిజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని వెల్లడించారు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు..