BJP Morcha: దేశ రాజ్యాంగాన్ని అవమాన పరిచే విధంగా రాహుల్ గాంధీ విదేశీ గడ్డ మీద మాట్లాడారని బీజేపీ మోర్చా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈనేపథ్యంలో బీజేపీ ఎస్సీ మోర్చ జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మొదటి నుండీ దళిత గిరిజన బీసీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. ఈ వర్గాలను ఓటు బ్యాంక్ గా మాత్రమే చూస్తుందన్నారు. రాహుల్ గాంధీ రిజర్వేషన్ లు తొలగిస్తా మని అంటున్నారని తెలిపారు. గతంలో నెహ్రూ, రాజీవ్ గాంధీ లు కూడా రిజర్వేషన్ లకు వ్యతిరేకంగా మాట్లాడారన్నారు. అంబేద్కర్ ను చట్ట సభల్లో అడుగుపెట్టనీయోద్దని చూసింది కాంగ్రెస్ అని మండిపడ్డారు. అంబేద్కర్ తో రాజ్యాంగం రాయించడం నెహ్రూ కి ఇష్టం లేదన్నారు. రాజీవ్ గాంధీ దృష్టిలో రిజర్వేషన్ లు పొందుతున్న వారు మూర్ఖులు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నిజ స్వరూపం ఇది అని తెలిపారు. రిజర్వేషన్ లు ఎత్తి వేస్తుందని బీజేపీ పై అసత్య ప్రచారం చేస్తుందన్నారు.
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఇక్కడ ఓట్ల కోసం బీజేపీ రిజర్వేషన్ లు ఎత్తివేస్తుందని మాట్లాడుతాడని మండిపడ్డారు. విదేశాలకు వెళ్లి రిజర్వేషన్ లకు వ్యతిరేకంగా, రాజ్యాంగాన్ని అవమానించేలా మాట్లాడుతారన్నారు. కాంగ్రెస్ పాలనలో రాజ్యాంగ దినోత్సవంను జరపలేదన్నారు. మోడీ ప్రధాని అయ్యాక కాన్స్టిట్యూషన్ డే జరుపుతున్నారన్నారు. ముస్లింల ఓట్ల కోసం బీసీలకి రావాల్సిన రిజర్వేషన్ లు వాళ్ళకి కాంగ్రెస్ ఇచ్చిందన్నారు. అంబేద్కర్ ను అవమానించింది కాంగ్రెస్ అని మండిపడ్డారు. అంబేద్కర్ ను గౌరవించింది బీజేపీ అని క్లారిటీ ఇచ్చారు.
దళిత మోర్చ రాష్ట్ర అధ్యక్షులు కొండేటి శ్రీధర్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ తన మనసులో మాట విదేశాలకు వెళ్లి బయట పెట్టారన్నారు. రిజర్వేషన్ లను తగ్గిస్తామని మాట్లాడారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ పప్పు అని తెలిసే ఆయన్ని ప్రధాని చేయలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ తలలో మెదడు లేకుండా మాట్లాడుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ దేశ ప్రజలకి, మోడీ కి బేషరతు గా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Top Headlines @ 1 PM: టాప్ న్యూస్