Minister Parthasarathy: జగన్‌పై మంత్రి పార్థసారథి ఫైర్.. విద్వేష రాజకీయాలతో అధికారంలోకి రావాలనుకుంటున్నారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Parthasarathy: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తూ, విద్వేషాలను రెచ్చగొట్టి మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన రాజకీయాలే ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారని వ్యాఖ్యానించారు. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల కంటే తన రాజకీయ లక్ష్యాలనే ముఖ్యంగా భావిస్తున్నారని మంత్రి పార్థసారథి అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించారని, అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఆ వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని విమర్శించారు.
‘విద్వేషాలతో మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నం’
గతంలో బాబాయ్ హత్య, కోడికత్తి ఘటన, తుని రైలు దహనం వంటి సంఘటనల నేపథ్యంలో రాజకీయ లబ్ధి పొందారని, ఇప్పుడు కూడా అంతకంటే తీవ్రమైన విద్వేషాలను రెచ్చగొట్టి అధికారంలోకి రావాలని చూస్తున్నారని ఆరోపించారు పార్థసారథి.. ప్రజలను ఎప్పటికప్పుడు మోసం చేయాలని చూస్తే వారు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఇక, దళితుల పట్ల జగన్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును ప్రజలు గుర్తు చేసుకోవాలని మంత్రి అన్నారు. అనంతబాబు కేసు, దళిత వైద్యుడి మరణం వంటి ఘటనల్లో అప్పటి ప్రభుత్వం ఎలా స్పందించిందో మేధావులు ఆలోచించాలని సూచించారు. దళితులను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారని ఆరోపించారు.
Also Read
- CM Chandrababu: ఎస్సీ, ఎస్టీల రక్షణకు ప్రత్యేక వ్యవస్థ.. ప్రొటెక్షన్ సెల్, విజిలెన్స్ కమిటీలు.. సీఎం కీలక సమీక్ష
- Perni Nani: స్పోర్ట్స్ కోటానే కాదు.. వికలాంగులు, ఓసీ, బీసీ కోటాల్లోనూ అక్రమాలు.. డీఎస్సీపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
- AP School Education Department: మెగా DSC-2025 నియామకంపై కీలక ప్రకటన.. విచారణకు ఆదేశించిన విద్యాశాఖ
- CM Chandrababu: ఉద్యోగుల సమస్యలపై ఫోకస్.. నేడు 11 సంఘాలతో సీఎం భేటీ.. పీఆర్సీ, ఐఆర్, డీఏపై కీలక చర్చ..
అమరావతి, మూడు రాజధానులపై వ్యాఖ్యలు
అమరావతిని రాజధానిగా ప్రకటించిన తీర్మానానికి గతంలో వైఎస్ జగన్ మద్దతు తెలిపారని, ఆ విషయాన్ని ఇప్పుడు ఎందుకు విస్మరించారో చెప్పాలని మంత్రి పార్థసారథి ప్రశ్నించారు. అనంతరం మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చి ఆయా ప్రాంతాల ప్రజలను అయోమయంలోకి నెట్టారని విమర్శించారు. ప్రస్తుతం అమరావతిలో ప్రశాంత వాతావరణాన్ని కూడా చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
ప్రతిపక్ష హోదాపై వ్యాఖ్యలు
వైఎస్ జగన్‌కు రాజ్యాంగంపై గౌరవం లేదని, అయితే రాజ్యాంగంలో లేని ప్రతిపక్ష హోదాను మాత్రం కోరుతున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్‌లపై అసభ్య వ్యాఖ్యలు చేయించారని ఆరోపించారు. మరోవైపు.. సోషల్ మీడియాను ప్రభుత్వం మీద అసత్య ప్రచారం కోసం ఉపయోగిస్తే సహించబోమని హెచ్చరించారు. అలాగే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత నటుడు ప్రకాష్ రాజ్‌కు లేదని వ్యాఖ్యానించారు మంత్రి కొలుసు పార్థసారథి..
తాజావార్తలు
-
SBI Big Expansion Plan: SBI కీలక నిర్ణయం.. 12 వేల ఉద్యోగాలు, 200-250 కొత్త బ్రాంచ్‌లు.. పూర్తి వివరాలు
-
Anta Ramuloru Chooskuntaru: సంగీత్ శోభన్, అనశ్వర రాజన్ జోడీకి క్రేజీ టైటిల్.. ‘అంతా రాములోరు చూస్కుంటారు’ అంటూ గ్లింబ్స్ తో సర్ప్రైజ్!
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Producer Council Elections: ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో సందడి.. ఓటేసిన అగ్ర నిర్మాతలు, యువ హీరోలు!
-
Malaika Arora: అర్జున్ కపూర్‌తో బ్రేకప్.. 52 ఏళ్ల మలైకా 33 ఏళ్లు వజ్రాల వ్యాపారితో కొత్త జీవితం?
ట్రెండింగ్
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!