వైసీపీపై మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంపై కుట్రతో కొందరు అన్ని కార్యక్రమాల పై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు కుమార్తె వివాహంలో రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళిశాఖ మంత్రి ఎస్.సవిత పాల్గొన్నారు. శనివారం హైదరాబాద్ లోని సిటాడెల్ కన్వెన్షన్ సెంటర్ లో శనివారం జరిగిన ఈ వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులు గాయత్రి సొనాక్షి, రుత్విక్ సాయిని మంత్రి సవిత ఆశీర్వదించారు.
గృహనిర్మాణ నిధులను జగన్ ప్రభుత్వం మళ్లించిందని ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్ధసారథి కీలక కామెంట్లు చేశారు. రిషికొండ నిర్మాణానికి గృహ నిర్మాణ నిధులను మళ్లించి ఉండొచ్చని మంత్రి ఆరోపించారు. గత ప్రభుత్వంలో ఖరారు చేసిన గృహ నిర్మాణ లబ్దిదారుల జాబితాను మార్చేదే లేదని ఆయన స్పష్టం చేశారు.
గృహానిర్మాణాలు సకాలంలో పూర్తి చేయటానికి కార్యాచరణ, ప్రణాళిక సిద్ధం చేయాలని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచారశాఖ మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు అన్ని సౌకర్యాలతో గృహాలు నిర్మించే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి టీడీపీలో చేరారు. విజయవాడలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీకి రాజీనామా చేసిన పార్థసారథి.. గతంలోనే టీడీపీ చేరతానని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదటి జాబితాలో తనకు టిక్కెట్ ఇవ్వడం ఆనందంగా ఉందని పార్థసారథి అన్నారు. పార్టీ నిర్ణయం ప్రకారం నూజివీడు వెళ్తున్నానని తెలిపారు. మరోవైపు.. కోటి 30 లక్షల మందితో సర్వే చేసి టిక్కెట్లు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.…
ఒకరు మాజీ మంత్రి. ఇంకొకరు అమాత్య అనిపించుకోవాలని ఆశగా ఎదురు చూస్తున్న ఎమ్మెల్యే. ఇద్దరూ బీసీ సామాజికవర్గమే. రెండున్నరేళ్ల కేబినెట్ ప్రక్షాళన వారిని ఊరిస్తోంది. బెర్త్ కోసం ఎవరి లెక్కలు వారివే. మరి.. మంత్రివర్గంలో చేరడానికి వారు పెట్టుకున్న కొలమానం ఏంటి? ఎవరు ఏ రూట్‌ను ఎంచుకున్నారు? కేబినెట్లో బెర్త్ కోసం పార్థసారథి, జోగి రమేష్ ఆశలు ఆర్నెళ్ల తర్వాత జరిగే మంత్రివర్గ ప్రక్షాళనలో బెర్త్ కన్ఫామ్ చేసుకునేందుకు కృష్ణాజిల్లాలో కొందరు ఎమ్మెల్యేలు ఇప్పటి నుంచే కసరత్తు…
కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, కొన్ని కులాల మీద ద్వేష భావాన్ని పెంచడానికి రఘురామకృష్ణరాజు ప్రయత్నించారు అని వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి అన్నారు. ప్రభుత్వం మీద ద్వేష భావాన్ని ప్రజల్లో జొప్పించాలని రఘురామకృష్ణరాజు ప్రయత్నించారు. రఘురామకృష్ణ చర్యలన్నీ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి, చేస్తున్న ప్రయత్నం కాదా అని అన్నారు. రఘురామకృష్ణరాజు నియోజకవర్గానికి వెళ్తే పదిమంది కూడా రాని పరిస్థితులు ఉన్నాయి. ప్రజలు అతని తీరు చూసి అసహ్యించుకుంటున్నారు. రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలకు, రాజద్రోహ పనులుకు పాల్పడ్డారనే రఘురామ…