AP Liquor Scam Case: లిక్కర్ స్కామ్‌లో కీలక మలుపు.. సత్యప్రసాద్‌కు ముందస్తు బెయిల్.. ఏసీబీ కోర్టు ఉత్తర్వులు రద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎక్సైజ్ శాఖ మాజీ అసిస్టెంట్ కమిషనర్ సత్యప్రసాద్‌కు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు సోమవారం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ కల్పించాలని కోరుతూ సత్యప్రసాద్ తొలుత ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. అయితే, ఆ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. అప్రూవర్‌గా మారే నిందితులు కేసు విచారణ పూర్తయ్యే వరకు జైలులోనే ఉండాల్సి ఉంటుందని, అలాంటి పరిస్థితుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయడం సాధ్యం కాదని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది.
ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సత్యప్రసాద్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు గతంలోనే పూర్తయ్యాయి. అనంతరం తీర్పును న్యాయమూర్తి రిజర్వ్ చేశారు. తాజాగా ఈ కేసులో తీర్పు వెలువరించిన హైకోర్టు, సత్యప్రసాద్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఏసీబీ కోర్టు తిరస్కరించిన ముందస్తు బెయిల్ పిటిషన్‌కు హైకోర్టులో ఉపశమనం లభించినట్లైంది. హైకోర్టు ఉత్తర్వులతో లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు, తదుపరి న్యాయపరమైన పరిణామాలపై ఆసక్తి నెలకొంది.
Also Read
- APPSC Group 1 మూల్యాంకనంపై హైకోర్టులో తుది విచారణ.. కీలక వాదనలు..
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
- Amaravati - Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!