ఆంధ్రప్రదేశ్‌లో 55 మంది ప్రభుత్వ వైద్యులను విధుల నుంచి తొలగించింది రాష్ట్ర ప్రభుత్వం.. లోకాయుక్త ఆదేశాలతో విధులకు డుమ్మా కొట్టిన వైద్యులను విధుల నుంచి టెర్మినేట్ చేసింది ఏపీ ప్రభుత్వం.. చర్యలు తీసుకున్నట్టు లోకాయుక్తకు నివేదిక పంపించింది ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ.. తొలగింపునకు గురైన వైద్యుల్లో అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు..
కనుమ పండుగ రోజున కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు చుక్కెదురైంది. ముడా కుంభకోణం కేసులో దర్యాప్తు కొనసాగించాలని లోకాయుక్తకు కర్ణాటక హైకోర్టు ఆదేశించింది.
మైసూరు భూ కుంభకోణం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లోకాయుక్త సమన్లు జారీ చేసింది. బుధవారం విచారణకు రావాలని సమన్లలో పేర్కొంది. దీంతో మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా)కు సంబంధించిన కేసులో ముఖ్యమంత్రిని లోకాయుక్త ప్రశ్నించనుంది.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై మైసూరు లోకాయుక్త ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ప్లాట్ల కేటాయింపులో కుంభకోణానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
సిద్ధరామయ్య రాజీనామా చేయాలని బీజేపీ- జేడీఎస్ డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై స్పందించాలని ముఖ్యమంత్రిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించాగా.. సహనం కోల్పోయిన ఆయన, మైక్‌లను పక్కకు తోసేసి.. అవసరమైతే నేనే పిలిచి మాట్లాడుతాగా అంటూ సీరియస్ అయ్యారు.
కర్ణాటకలోని బీజేపీ ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్ప తన కుమారుడు కేఏఎస్ అధికారి ప్రశాంత్ మదాల్ ద్వారా లంచం డిమాండ్ చేశారన్న అభియోగంపై లోకాయుక్త పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.