అమరావతిలో శుక్రవారం రాజధాని నిర్మాణ పనులు పున:ప్రారంభం కాబోతున్నాయి. ప్రధాని మోడీ చేతుల మీదుగా పనులు ప్రారంభం కానున్నాయి. అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. ఇక రాష్ట్రంలో ఉన్న వివిధ రాజకీయ పార్టీలకు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానాలు పంపించింది.
Nimmala Rama Naidu: సోషల్ మీడియా వేదికగా మంత్రి నిమ్మల రామానాయుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఇందులో భాగంగా.. అబద్ధాల్లో జగన్ కి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చని, పోలవరం ఎత్తుపై తప్పుడు ప్రచారం మానుకోమని ఆయన ఆన్నారు. కన్నతల్లిని తోడబుట్టిన చెల్లిని మోసం చేసి జగన్ చిత్కారానికి గురయ్యాడని, ప్రపంచ చరిత్ర తిరగేస్తే తల్లిని, చెల్లిని మోసం చేసిన వంటి దౌర్భాగ్య రాజకీయవేత్త ఎక్కడా కనిపించడు ఇతను తప్ప అంటూ తెలిపారు. Also…
మాజీ సీఎం జగన్ పై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏలేరు రిజర్వాయర్కు అంత పెద్దమొత్తంలో వరద వచ్చినా ప్రాణ నష్టం జరగలేదంటే ప్రభుత్వ అప్రమత్తతే కారణమని మంత్రి పేర్కొన్నారు. 114 చోట్ల కట్ట బలహీనతలు గుర్తించి పటిష్టపరిచి ఆస్తి నష్టాన్ని తగ్గించామని తెలిపారు. ఏలేరు రిజర్వాయర్ గురించి మాట్లాడే స్థాయి జగన్ కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.