సెబీ చీఫ్ మాధబి పూరి బుచ్ పై కాంగ్రెస్ సోమవారం పలు ఆరోపణలు చేసింది. మాధబి 2017 నుంచి 2021 వరకు సెబీలో పూర్తికాల సభ్యురాలిగా ఉన్నారని కాంగ్రెస్ పేర్కొంది. 2022లో ఆమె ఛైర్‌పర్సన్ అయ్యారు. 2017 నుంచి 2024 మధ్య మాధవి ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రూ.16.80 కోట్ల జీతం తీసుకున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేడా విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ కాలంలో మాధబి సెబితోపాటు ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి కూడా జీతం తీసుకున్నారని ఆరోపించారు. ఇది ప్రయోజనాల పరస్పర విరుద్ధమైన అంశమని కాంగ్రెస్ పేర్కొంది. కాంగ్రెస్ చేస్తున్న ఈ ఆరోపణలపై మాదబి నుంచి ఇంకా ఎలాంటి స్పందన లేదు.
READ MORE: Heavy Rains in AP: కృష్ణా నదీ పరివాహక ప్రాంత రైతులను అప్రమత్తం చేసిన వ్యవసాయ శాఖ
ఈ సందర్భంగా సెబీ నిజాయితీపై పవన్ ఖేరా ప్రశ్నలు లేవనెత్తారు. మార్కెట్ రెగ్యులేటర్ నిష్పాక్షికతను, స్వతంత్రతను కొనసాగించాలన్నారు. సెబి చీఫ్ ఐసిఐసిఐ బ్యాంక్ వంటి ప్రైవేట్ సంస్థ నుంచి జీతం పొందుతున్నప్పుడు సెబి నిష్పాక్షికతను ఎలా నిర్ధారించగలరని ఖేడా ప్రశించారు? సెబీపై ‘బాహ్య ప్రభావం’ లేదని నిర్ధారించడానికి ఈ విషయాన్ని దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
READ MORE:Swati Maliwal Assault Case: స్వాతి మలివాల్ దాడి కేసులో కేజ్రీవాల్ పీఏకి బెయిల్..
గత నెలలో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్టులో
అమెరికాకు చెందిన షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్‌బర్గ్ రీసెర్చ్.. గతంలో సెబీ చైర్ పర్సన్ మాధబి పురి బచ్ పై సంచలన ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషన్ ఫండ్ లలో మాధబి పురి, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని ఆరోపించింది. ఈ మేరకు విజిల్ బ్లోయర్ నుంచి తమకు సమాచారం అందిందని హిండెన్ బర్గ్ పేర్కొంది. అదానీకి చెందిన మారిషన్, అఫ్ షోర్ షెల్ సంస్థల వివరాలను తెలుసుకోవడంలో సెబీ ఆసక్తి చూపకపోవడం తమను ఆశ్చర్యపరిచిందని పేర్కొంది. గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ నియంత్రణలో కొన్ని అఫ్ ఫోర్ బెర్ముడా, మారిషస్ ఫండ్ లో మాధవి పురి, ఆమె భర్త ధావల్ బచ్ లకు వాటాలు ఉన్నాయని హిండెన్ బర్గ్ పేర్కొంది.