అనకాపల్లి ఫుడ్ పాయిజన్ ఘటనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బాలల సంక్షేమ సంస్థలు, హాస్టళ్లను తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్లకు సీఎం చంద్రబాబు నాయుడు అదేశాలు జారీ చేశారు.. హాస్టళ్లు, సంక్షేమ సంస్థలు నడిపేందుకు అనుమతులు ఉన్నాయా? లేదో? చూడాలని కలెక్టర్లకు సూచించారు సీఎం.. ఆయా సంస్థలు నిర్వహిస్తున్న భవనాలు సురక్షితమా కాదా అన్న కోణంలోనూ తనిఖీ చేయాలని స్పష్టం చేశారు.