ఏపీలో తుది ఓటర్ల జాబితాను ప్రకటించింది రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి.. ఆ తుది జాబితా ప్రకారం ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య 4,14,40,447కు పెరిగింది.. అందులో పురుష ఓటర్ల సంఖ్య 2,03,52,816గా ఉండగా.. మహిళా ఓటర్ల సంఖ్య 2,10,84,231గా ఉంది.. ఇక, థర్డ్ జెండర్ ఓటర్ల సంఖ్య 3400గా ప్రకటించింది ఈసీ.. వెలగపూడి చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కార్యాలయం నుంచి ఈ జాబితాను విడుదల చేశారు..
పార్లమెంట్ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం తెలంగాణ లోని ఓటర్ల వివరాలను తెలియజేస్తూ తుది జాబితా విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 3,30,37,011 ఓటర్లు ఉన్నట్టు తెలియజేసింది. ఇందులో పురుషులు 1,64,47,132, మహిళలు 1,65,87,244, థర్డ్ జెండర్ 2,737 మంది ఉన్నారు. 15,378 సర్వీస్ ఓటర్లు, 3,399 ఓవర్సీస్ ఓటర్లు ఉన్నారు. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన యువత ఇప్పటికీ ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సీఈవో వికాస్ రాజ్ సూచించారు. తెలంగాణలో అత్యధికంగా శేరిలింగంపల్లిలో…