వెయిటింగ్‌లో ఉన్న ఐపీఎస్‌లకు మెమో జారీ వెనుక షాకింగ్ రీజన్స్ ఉన్నాయని తెలుస్తోంది. విచారణకు ఆదేశించిన కేసులను నీరుగార్చేలా వెయిటింగులో ఉన్న కొందరు ఐపీఎస్‌లు కుట్ర చేస్తున్నట్టు ప్రభుత్వం గుర్తించింది.. విచారణ చేస్తున్న అధికారులను, సిబ్బందితో వెయిటింగ్‌లో ఉన్న కొందరు ఐపీఎస్‌లు మీటింగ్‌లు పెడుతున్నారని ప్రభుత్వానికి సమాచారం అందింది.
వెయిటింగ్‌లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారులకు షాక్ ఇచ్చారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు.. వెయిటింగ్‌లో ఉంటూ హెడ్ క్వార్టర్స్‌లో అందుబాటులో ఉండని సీనియర్ ఐపీఎస్‌లకు మెమోలు జారీ చేశారు.. ప్రతీరోజు ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం వరకు డీజీపీ ఆఫీసులోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు డీజీపీ.