CM Chandrababu: నేడు శ్రీశైలం, సత్యసాయి జిల్లాలో సీఎం పర్యటన..
- ఈ రోజు నంద్యాల.. శ్రీసత్యసాయి జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన..
- శ్రీశైలంలో శ్రీమల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్న సీఎం..
- శ్రీశైలం జలాశయాన్ని సందర్శించి.. కృష్ణానదికి జలహారతి సమర్పించనున్న చంద్రబాబు..
- గుండుమలలోని ఎన్టీఆర్ భరోసా పింఛన్లు లబ్దిదారులకు పంపిణీ చేనున్న ఏపీ సీఎం..
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ రోజు నంద్యాల, శ్రీసత్యసాయి జిల్లాల్లో పర్యటించనున్నారు.. ఉదయం 9 గంటలకు రెండు జిల్లాల పర్యటనలకు బయల్దేరనున్నారు సీఎం చంద్రబాబు. నేడు శ్రీశైలం రానున్నారు.. సీఎం చంద్రబాబు. ఉదయం 10:30కి సున్నిపెంట హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 10:50కి శ్రీమల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం శ్రీశైలం జలాశయాన్ని సందర్శించి.. కృష్ణానదికి జలహారతి సమర్పిస్తారు. తర్వాత నీటిపారుదలశాఖ అధికారులతో భేటీ అవుతారు.. ముఖ్యమంత్రి. ఇక శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రాన్ని సందర్శిచి.. నీటి వినియోగదారుల అసోసియేషన్‌తో భేటీ అవుతారు. తిరిగి 12:30కి హెలికాప్టర్లో అనంతపురం వెళ్తారు సీఎం చంద్రబాబు.
Read Also: Off The Record : తెలంగాణ పాలిటిక్స్ లో పవర్ హై వోల్టేజ్
Also Read
- Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్లైన్స్లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
- Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..
- TDP నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం.. చంద్రబాబు ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం
- AP SSC Results 2026: రేపే ఏపీ టెన్త్ ఫలితాలు.. ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు..
ఇక, శ్రీ సత్యసాయి జిల్లా గుండుమలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీని చేపట్టనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు… ప్రభుత్వ పాలిటెక్నీకల్ కళాశాలలో లబ్దిదారులకు పింఛన్ అందిస్తారు.. సీఎం. అనంతరం మల్బరి ప్లాంటేషన్ షెడ్‌ను సందర్శించి .. పట్టు రైతులతో ముఖాముఖి మాట్లాడతారు. తర్వాత గుండుమలలో కరియమ్మ దేవి ఆలయాన్ని సందర్శిస్తారు. కరియమ్మ గుడి వద్దనే గ్రామస్తులతో చంద్రబాబు ఇంటరాక్షన్ ఉండనుంది.. మధ్యాహ్నం 3:25 నుంచి 4:25 వరకు స్థానికులతో ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత పుట్టపర్తి నుంచి ప్రత్యేక విమానం ద్వారా అమరావతికి తిరిగి బయల్దేరనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..
సీఎం షెడ్యూల్..
* ఉదయం హెలికాప్టర్ లో 10:30 కి సుండిపెంటకు హెలిప్యాడ్ చేరుకోనున్న సీఎం చంద్రబాబు
* 10:50 కి శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్న చంద్రబాబు
* 11:25 కి శ్రీశైలం జలాశయం సందర్శన, కృష్ణానదికి జలహారతి, నీటిపారుదలశాఖ అధికారులతో భేటీ
* 11:40కి శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రం సందర్శన
* మధ్యాహ్నం 12:05కి నీటి వినియోగదారుల అసోసియేషన్ తో చంద్రబాబు భేటీ
* 12:30కి హెలికాప్టర్ లో అనంతపురం వెళ్లనున్న సీఎం చంద్రబాబు
* మధ్యాహ్నం 1:45కి గుండుమల ప్రభుత్వ పాలిటెక్నీకల్ కళాశాల హెలిపాడ్ చేరుకొనున్న సీఎం.
* 2:20 గంటలకు గుండుమలలోని ఎన్టీఆర్ భరోసా పింఛన్లు లబ్దిదారులకు పంపిణీ
* 3:20 కి గుండుమలలో కరియమ్మ దేవి దేవాలయన్ని సందర్శన.
* 3:25 నుంచి 4:25 దాక గ్రామ ప్రజలతో ప్రజా వేదిక కార్యక్రమంలో ముఖాముఖి.
తాజావార్తలు
-
Ramya Krishna : రేపు పెళ్లి అనంగా.. రాత్రి 2 వరకు ఎన్టీఆర్ తోనే ఉన్న..!
-
Donald Trump: ట్రంప్‌ను రోస్ట్ చేసిన కింగ్ చార్లెస్.. మేము లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారంటూ ఎగతాళి
-
KTR: కేసీఆర్ అప్పుడే చిలుకకు చెప్పినట్టు చెప్పారు.. కల్వకుర్తి సభను గుర్తు చేసిన కేటీఆర్..
-
Uttam Kumar Reddy: ప్రాణహిత-చేవెళ్లపై వెనక్కి తగ్గేదే లేదు! తుమ్మిడిహట్టి ప్రతిపాదనలపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
-
Malla Reddy: పార్టీ మార్పుపై మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో