NBK 112 : బాలయ్య -కొరటాల మాస్ సినిమా కాదు.. అంతకుమించి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కనున్న ప్రాజెక్ట్‌పై సినీ వర్గాల్లో భారీ చర్చ జరుగుతోంది. ఈ సినిమా కథ అద్భుతంగా వచ్చిందని, బాలయ్యను ఇప్పటివరకు చూడని కొత్త కోణంలో చూపించేలా కొరటాల శివ స్క్రిప్ట్‌ను రూపొందించారనే ప్రచారం సాగుతోంది. కొరటాల సినిమాల్లో ఉండే సామాజిక సందేశం, బలమైన భావోద్వేగాలు, పవర్ఫుల్ మాస్ ఎలివేషన్స్ ఈ చిత్రంలో కూడా ప్రధాన ఆకర్షణగా ఉండనున్నాయని సమాచారం. ఈ అంశాలన్నింటినీ బాలకృష్ణ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఓ రేంజ్లో ప్లాన్ చేస్తున్నట్టుగా ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్.
ఈ చిత్రం కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటే, బాక్సాఫీస్ వద్ద బాలకృష్ణ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఇది నిలిచే అవకాశాలు ఉన్నాయని టాక్. ఈ సినిమాకు బాలయ్య కెరీర్లోనే భారీ బడ్జెట్ ఖర్చు చేస్తున్నారు. ఏకంగా 150 నుంచి 200 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు మేకర్స్. ఇప్పుడు కథ కూడా అదిరిపోయిందని అంటున్నారు. ఈ లెక్కన ఎన్బీకె 112 మామూలుగా ఉండదని నందమూరి అభిమానులు ఫిక్స్ అయిపోయారు. ఇప్పటికే గ్రాండ్‌గా లాంచ్ అయిన ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వలో ఎన్బీకె 111 ప్రాజెక్ట్ చేస్తున్నాడు బాలయ్య. ఈ సినిమా అయిపోయిన వెంటనే కొరటాల ప్రాజెక్ట్ పై ఫోకస్ చేయనున్నాడు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే.. వచ్చే ఏడాది సమ్మర్లో ఎన్బీకె 112 థియేటర్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. కాగా, ఈ సినిమాకు కార్పెంటర్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!