Pawan Kalyan: వైసీపీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. మౌనం బలహీనత కాదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: జనసేన పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి సారిస్తూ పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీలతో కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఏర్పాటు చేసిన 28 మంది సభ్యులతో కూడిన కమిటీలతో విడివిడిగా సమావేశమైన ఆయన, గ్రామస్థాయి నుంచి పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడంపై దిశానిర్దేశం చేశారు.
ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక సీనియర్ నాయకుడిని పరిశీలకుడిగా, కేంద్ర కార్యాలయం నుంచి ఐదుగురు సభ్యులను పర్యవేక్షణ కోసం నియమించినట్లు తెలిపారు పవన్… సోమవారం నుంచి కమిటీ సభ్యులు అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటించి జనసేన కార్యకర్తలు, వీర మహిళలు, పార్టీ సభ్యుల నుంచి అభిప్రాయాలు, వినతులు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై కూడా పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. విధానపరమైన చర్చలకు బదులుగా వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిత్వ హననానికి పాల్పడితే అవసరమైనప్పుడు ధీటుగా సమాధానం ఇస్తామని స్పష్టం చేశారు. తాము మౌనంగా ఉంటే దానిని బలహీనతగా భావించవద్దని, అవసరమైతే గట్టిగా స్పందిస్తామని అన్నారు.
Also Read
- AP Drought Mandals 2026: కరువు కోరల్లో ఏపీ.. 21 జిల్లాల్లో 388 మండలాలు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
- Amaravati Construction: అమరావతి నిర్మాణంలో కీలక సమస్య..! కార్మికులపై అధికారుల దృష్టి
- AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
- Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
తాను ఒకే కులానికి పరిమితమైన నాయకుడినైతే బాలినేని శ్రీనివాస్ రెడ్డి వంటి నాయకులు జనసేనలో ఎందుకు చేరతారని ప్రశ్నించిన పవన్ కల్యాణ్, జనసేన అన్ని వర్గాల కోసం పనిచేసే పార్టీ అని పేర్కొన్నారు. అలాగే పంతం నానాజీ వ్యాఖ్యలపై స్పందిస్తూ, అసభ్య భాషను తాము ప్రోత్సహించబోమని, అయితే గతంలో వైసీపీ నేతలు ఉపయోగించిన భాషను కూడా ప్రజలు గుర్తుంచుకున్నారని అన్నారు. ఇక, యువత ఉచితాల కంటే భవిష్యత్తును కోరుకుంటోందని పేర్కొన్న పవన్ కల్యాణ్, హుద్‌హుద్ తుఫాన్ సమయంలో ఓ యువకుడు “25 కేజీల బియ్యం కాదు.. 25 సంవత్సరాల భవిష్యత్తు కావాలి” అని చెప్పిన మాటలు తనకు ఇప్పటికీ గుర్తున్నాయని తెలిపారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా జనసేన పని చేస్తుందని స్పష్టం చేశారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
తాజావార్తలు
-
Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
-
South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
-
Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!