Theatres Closure : జూన్ 1వ తేదీ నుంచి సినిమా హాళ్లు బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయంపై విచారణ చేపట్టాలని, ఈ నిర్ణయం వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకోవాలని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ హోం శాఖ ముఖ్య కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు.
Read Also : HHVM : వీరమల్లు గురించే టెన్షన్.. ముందున్నవి సినిమాలు కాదా..?
తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమా విడుదలకు ముందు థియేటర్లు మూసివేయాలని ఆ నలుగురు ఒత్తిడి చేస్తున్నారనే వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఈ సందర్భంగా సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పందిస్తూ, హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్‌తో చర్చించారు.
ఈ పరిణామాలతో పాటు, ఎగ్జిబిటర్లు మరియు డిస్ట్రిబ్యూటర్లు ఒక కార్టెల్‌గా ఏర్పడి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంపై కూడా విచారణ జరపాలని దుర్గేష్ స్పష్టం చేశారు. సినిమా హాళ్ల మూసివేత వల్ల ఎన్ని సినిమాలు ప్రభావితం అవుతాయి, రాష్ట్ర ట్యాక్స్ రెవెన్యూకి ఎంత నష్టం వాటిల్లుతుందనే అంశాలపై కూడా వివరాలు సేకరించనున్నారు.
Read Also : Manoj : ‘కన్నప్ప’ టీమ్.. నన్ను క్షమించండి.. మనోజ్ ఎమోషనల్ కామెంట్స్..