RCB vs SRH: ఇషాన్ కిషన్ వన్ మ్యాన్ షో.. ఆర్సీబీ ముందు భారీ టార్గెట్..!
- 94 పరుగులతో చెలరేగిన ఇషాన్ కిషన్..
- నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్.
- ఆర్సీబీ టార్గెట్ 232.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RCB vs SRH: లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దానితో బ్యాటింగ్ కు వచ్చిన సన్‌రైజర్స్ హైదరాబాదు (SRH) జట్టు బ్యాటింగ్‌లో అదరగొట్టింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) బౌలర్లపై సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు విరుచుకుపడి నిర్ణీత 20 ఓవర్లలో 231 పరుగులు చేసి ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. హైదరాబాదు జట్టు తొలి వికెట్ 54 పరుగుల వద్ద కోల్పోయినా, ఆరంభం దుమ్ముదులిపేలా సాగింది. అభిషేక్ శర్మ 17 బంతుల్లో 34 పరుగులు (3 ఫోర్లు, 3 సిక్సులు) చేసి ఆకట్టుకోగా, ట్రావిస్ హెడ్ 10 బంతుల్లో 17 పరుగులు చేశాడు.
Also Read
ఇక ఆ తర్వాత వచ్చిన వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ 48 బంతుల్లో 94 పరుగులు* (7 ఫోర్లు, 5 సిక్సులు) తో అదరగొట్టాడు. చివరి వరకు ఆడుతూ స్కోరు బోర్డుపై పరుగుల వర్షం కురిపించాడు. ఇక మిడిల్ ఆర్డర్ లో హెన్రిచ్ క్లాసెన్ (13 బంతుల్లో 24), అనికేత్ వర్మ (9 బంతుల్లో 26) కూడా వేగంగా ఆడారు. ఇన్నింగ్స్ చివర్లో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 6 బంతుల్లో 13 పరుగులు చేసి స్కోరు పెరిగేందుకు తోడ్పడ్డారు. మొత్తంగా SRH జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 231 పరుగుల భారీ స్కోర్ చేసింది. చివరి 5 ఓవర్లలో SRH 63 పరుగులు సాధించింది.

RCB బౌలింగ్ విభాగంలో రోమారియో షెపర్డ్ 2 ఓవర్లలో 14 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకోగా.. భువనేశ్వర్ కుమార్, లుంగి ఎంగిడి, సుయాష్ శర్మ, కృనాల్ పాండ్యా చెరో వికెట్ తీసినా భారీగా పరుగులు సమర్పించుకున్నారు.
తాజావార్తలు
-
ACB Raids : నిమ్స్ అధికారిపై ఏసీబీ సోదాలు.. బినామీల ఇళ్లలో కీలక పత్రాలు
-
Thackeray Brothers: CJP ఆందోళనకు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల మద్దతు.!
-
Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
-
Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
-
TGSPDCL : విద్యుత్ డిమాండ్లో కొత్త రికార్డు.. 12,044 మెగావాట్లు.!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!