White Paper On Power Sector: విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల..
- ఏపీ విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు..
- పీపీఏల్లో అవకతవకలు.. సోలార్.. విండ్.. పవర్ కొనుగోళ్లల్లో అవినీతిపై వివరణ..
- హైడ్రో పంప్ ఎనర్జీ.. స్మార్ట్ మీటర్ల కుంభకోణం జరిగిందన్న సీఎం..
- వ్యవసాయ మీటర్లు.. పవర్ ప్రాజెక్టుల గోల్‌మాల్‌పై వివరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
White Paper On Power Sector: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుసగా వివిధ రంగాలపై శ్వేతప్రతాలు విడుదల చేస్తూనే ఉంది.. ఈ రోజు విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను బయటపెడుతూ.. పీపీఏల్లో అవకతవకలు, సోలార్, విండ్, పవర్ కొనుగోళ్లల్లో అనితీపై వివరణ ఇచ్చారు.. ఇదే సమయంలో.. హైడ్రో పంప్ ఎనర్జీ, స్మార్ట్ మీటర్ల కుంభకోణం జరిగిందని పేర్కొన్నారు.. వ్యవసాయ మీటర్లు, పవర్ ప్రాజెక్టుల గోల్‌మాల్‌పై కూడా వివరణ ఇచ్చారు సీఎం చంద్రబాబు.. ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయని విమర్శించిన ఆయన.. శ్వేతపత్రాల ద్వారా ఆయా శాఖల గురించి ప్రజలందరికీ వాస్తవాలు చెప్పాలన్నదే తమ ప్రయత్నం అన్నారు.. సమర్థమైన పాలన వల్లే పేదలకు మెరుగైన ప్రయోజనాలు అందుతాయని, బాధ్యతలేని పరిపాలన వల్ల అనేక కష్టాలు ఎదురవుతాయన్నారు..
Read Also: Inaya Sultana: బాయ్ ఫ్రెండ్‌తో ఇనయా.. బాత్ టవల్‌లో ఈ రచ్చ ఏంట్రా?
Also Read
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
- APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
- Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
- Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
ఇక, విద్యుత్ తో ప్రతి ఒక్కరి జీవితం ముడిపడి ఉంది.. విద్యుత్ రంగంపైనే ప్రజల జీవన ప్రమాణాలు ఆధారపడి ఉంటాయన్నారు సీఎం చంద్రబాబు.. 2014లో తాము అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉంది. ఈ ఐదేళ్లలో విద్యుత్ రంగాన్ని పూర్తిగా నాశనం చేశారు.. అసమర్థులు పాలన చేస్తే ఇలాగే ఉంటుందని మండిపడ్డారు.. ఒక అసమర్థుడు, అహంకారి రెండూ కలిసిన నేత రాజకీయాలకు అనర్హుడు అని ఫైర్ అయ్యారు.. వాస్తవాలు ప్రజలకు తెలిపేందుకే శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నామన్న ఆయన.. ఏ శాఖ చూసినా తీవ్రమైన పరిస్థితి కనిపిస్తోంది.. తవ్విన కొద్దీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.. 2014-19 మధ్య విద్యుత్ ఉత్పత్తి పెంచి, కరెంటు బిల్లు పెంచకుండా, నాణ్యమైన కరెంటు ఇచ్చిన ఘనత నాటి టీడీపీ ప్రభుత్వానిది అన్నారు.. కరెంటుపై బాదుడు తెలిస్తే, కరెంటు షాక్ కొట్టాల్సిందే అన్నట్టుగా చార్జీలు పెంచారని దుయ్యబట్టారు..
Read Also: SLBC Meeting: SLBC సమావేశంలో కీలక నిర్ణయం.. రూ.5,40,000 కోట్లతో రుణ ప్రణాళిక..
2019తో పోల్చుకుంటే, 2024కి 98 శాతం కరెంటు బిల్లు పెంచేశారని.. 9 సార్లు కరెంటు బిల్లు పెంచి, పేదవాడిని పీక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు.. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, దేశంలోనే మొట్టమొదటి సారి విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. నేడు అవే సంస్కరణలు దేశానికి ఆదర్శం అయ్యాయి. గెలుపు ఓటమలు కంటే, మనం చేసిన పనులు, దేశానికి ఉపయోగపడ్డాయనే తృప్తి నాకుంది అన్నారు.. ఇక, సీఎం ఛాంబర్ లో కమోడ్లు, ఏసీలు కూడా పని చెయ్యట్లేదు.. ఆ రూమ్ కి ఎవరు వచ్చినట్టు లేరు అంటూ సెటైర్లు వేశారు సీఎం చంద్రబాబు నాయుడు.. విద్యుత్ శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంగా.. ఇక సీఎం చంద్రబాబు ఇంకా ఏమేమి మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌లను క్లిక్ చేయండి..
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!