CM Chandrababu Singapore Tour: రికార్డులు సరిచేసేందుకే వచ్చా.. సింగపూర్ మంత్రితో ఏపీ సీఎం కీలక వ్యాఖ్యలు..
- సింగపూర్ లో రెండో రోజు ఏపీ సీఎం పర్యటన..
- రికార్డులు సరిచేసేందుకే సింగపూర్ వచ్చానన్న చంద్రబాబు.. మానవ వనరులు, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి టాన్ సీ లాంగ్ తో భేటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu Singapore Tour: రికార్డులు సరిచేసేందుకే సింగపూర్ వచ్చానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. సింగపూర్‌లో రెండో రోజు పర్యటిస్తోన్న ఆయన.. సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖలోని మానవ వనరులు, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి టాన్ సీ లాంగ్ తో సమావేశం అయ్యారు.. గత ప్రభుత్వ హయాంలో సింగపూర్ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటిని పరిష్కరించే అంశంపై మంత్రి టాన్ సీ లాంగ్ తో చర్చించారు.. అయితే, రికార్డులు సరిచేసేందుకే సింగపూర్ వచ్చానని ఈ సందర్భంగా మంత్రి టాన్ సీ లాంగ్ కు స్పష్టం చేశారు చంద్రబాబు.. సింగపూర్ పై ఉన్న అభిమానంతో గతంలో హైదరాబాద్ లో సింగపూర్ టౌన్ షిప్ నిర్మించామని తెలిపిన ఆయన.. నవంబర్‌లో విశాఖపట్నంలో జరిగే భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని ఆహ్వానించారు..
Read Also: Mahabubabad: మునిగలవేడులో బావిలో పడ్డ ఆటో.. ఒకరి మృతి
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
ఇక, సింగపూర్ ను చూసే హైదరాబాద్ లో రాత్రిపూట రోడ్లను శుభ్రం చేసే కార్యక్రమాన్ని చేపట్టామని గుర్తుచేసుకున్నారు చంద్రబాబు.. మానవ వనరులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ట్రేడ్ రంగాల్లో సింగపూర్ భాగస్వామ్యం అవసరమని పేర్కొన్న ఆయన.. నాలెడ్జి ఎకానమీలో ఏపీకి చెందిన నిపుణులు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో పనిచేస్తున్నారని తెలిపారు.. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, ట్రాన్స్ మిషన్ కారిడార్ లు, పోర్టులు తదితర రంగాల్లో సింగపూర్ కంపెనీలు భాగస్వామ్యం వహించాలని కోరారు.. డేటా సెంటర్ల ఏర్పాటులోనూ సంబంధించిన అంశంలోనూ సింగపూర్ భాగస్వామ్యం అవసరం అన్నారు.. లాజిస్టిక్ రంగంలో సింగపూర్ బలంగా ఉందని.. ప్రస్తుతం ఏపీలోనూ పోర్టుల నిర్మాణం వేగంగా జరుగుతోందని వెల్లడించారు.. పోర్టులు, లాజిస్టిక్స్ రంగంలో ఉత్తమ విధానాలను అనుసరించటంలో సింగపూర్ సహకరించాలని కోరారు..
Read Also: Chairman’s Desk: హిందూ మతానికి, రాజకీయానికి సంబంధమేంటి..? హిందువులకు కొత్త పాఠాలేంటి..?
మరోవైపు, గతంలో హైదరాబాద్ వచ్చానని.. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిశానని ఈ సందర్భంగా తెలిపారు సింగపూర్ మంత్రి టాన్ సీ లాంగ్.. గ్రీన్ ఎనర్జీ రంగంలో , సబ్ సీ కేబుల్ రంగంలో ఆంధ్రప్రదేశ్‌తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నామన్నారు.. అలాగే గృహ నిర్మాణ రంగంలోనూ ఏపీతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని తెలిపారు సింగపూర్ మంత్రి టాన్ సీ లాంగ్.. ఇక, ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు..
తాజావార్తలు
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!