ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రుల బృందం సింగపూర్ పర్యటనపై హాట్ కామెంట్లు చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వైసీపీ పీఏసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేవలం దోచుకున్న డబ్బులు దాచుకోవడానికి మాత్రమే సింగపూర్ పర్యటన అని ఆరోపించారు.. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావడంలేదు.. అంతా దోచుకుంటున్నారని మండిపడ్డారు..
సింగపూర్ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిజీ బిజీగా గడుపుతున్నారు.. రెండు రోజుల పాటు కీలక సమావేశాలు, చర్చల్లో పాల్గొన్న ఆయన.. మూడు రోజు సింగపూర్ అధ్యక్షుడు, మంత్రులు, పలు సంస్థల ప్రతినిధులతో సమావేశాలు కాబోతున్నారు.. ముఖ్యంగా నేడు ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫిన్‌టెక్ రంగాలపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నారు..
రికార్డులు సరిచేసేందుకే సింగపూర్ వచ్చానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. సింగపూర్‌లో రెండో రోజు పర్యటిస్తోన్న ఆయన.. సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖలోని మానవ వనరులు, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి టాన్ సీ లాంగ్ తో సమావేశం అయ్యారు.. గత ప్రభుత్వ హయాంలో సింగపూర్ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటిని పరిష్కరించే అంశంపై మంత్రి టాన్ సీ లాంగ్ తో చర్చించారు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బృందం పర్యటన సింగపూర్‌లో కొనసాగుతోంది.. ఇవాళ రెండో రోజు సీఎం చంద్రబాబు మరింత బిజీగా గడపనున్నారు.. ఎయిర్ బస్, హనీవెల్, ఎవర్వోల్ట్ ప్రతినిధులతో సమావేశాలు కాబోతున్నారు.. రెండోరోజు పర్యటనలో సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో సహా.. పలు సంస్థల అధిపతులతో సమావేశంకానున్నారు.. నగరాల అభివృద్ధి, క్రీడలు, పోర్ట్ ఆధారిత పరిశ్రమలపై వారితో చర్చించబోతున్నారు..
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో తన సింగపూర్ పర్యటనపై కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కేబినెట్ సమావేశంలో సింగపూర్ టూర్‌పై స్పందించిన సీఎం.. గత ప్రభుత్వం హయాంలో సింగపూర్‌పై దుష్ప్రచారం చేశారు.. సింగపూర్ మంత్రులపై తప్పుడు ఆరోపణలు చేశారు.. అయితే, మళ్లీ సింగపూర్ తో సంబంధాలు పునరుద్ధరణ కోసం ఈ టూర్ ఉపయోగపడుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు..